మానవత్వం అంటే అదే.. కంటతడి పెట్టించేంతగా కాజల్ అగర్వాల్ ట్వీట్
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందగత్తే కాదు.. అందం కంటే మానవత్వం ఉన్న మనిషిగా స్పందిస్తుంటారు. మూడో కంటికి తెలియకుండా సామాజిక సేవ చేయడంలో ముందుంటారు. అరుకు ప్రాంతంలో అత్యంత వెనుకబడి ఉన్న గిరిజన పిల్లలకు ఉచిత విద్య, బాలికలు, యువతుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలు, శానిటైజేషన్ లాంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. స్వంతంగా గిరిజన విద్యార్థుల బాగోగులు పర్యవేక్షిస్తుంటారు. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా తనలో మానవత్వం తట్టిలేపిన ఓ విషయం గురించి ట్వీట్ చేసి కాజల్ ఎమోషనల్ అయ్యారు. అదేమిటంటే..

సస్పెండెడ్ కాఫీ, మీల్ అంటే తెలుసా?
మీకు సస్పెండ్ కాఫీ లేదా సస్పెండెడ్ మీల్ అంటే తెలుసా?.. మీకు తెలియకపోతే మీకు నేను అర్ధమయ్యే విధంగా చెబుతాను. నార్వేలో ఓ యువతి రెస్టారెంట్‌కు వెళ్లి కౌంటర్‌లో డబ్బులు ఇచ్చి.. ఐదు కాఫీ.. అందులో రెండు సస్పెండెడ్ అంటూ ఐదు కాఫీలకు డబ్బులు చెల్లించి మూడు కాఫీలు తీసుకొన్నారు.

రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి వచ్చి
అదే రెస్టారెంట్‌కు మరో వ్యక్తి వచ్చి పది కాఫీలు, ఐదు సస్పెండెడ్ అంటూ పది కాఫీలకు డబ్బులు చెల్లించి ఐదు కాఫీలు తీసుకొన్నాడు. అదే విధంగా మరో వ్యక్తి వచ్చి ఐదు మీల్స్, రెండు సస్పెండెడ్ అంటూ ఐదు మీల్స్‌కు డబ్బులు చెల్లించి మూడు లంచ్ ప్యాకెట్స్ తీసుకొన్నాడు.

అదే రెస్టారెంట్‌కు ఓ ముసలి వ్యక్తి వచ్చి
ఆ తర్వాత ఓ ముసలి వ్యక్తి రెస్టారెంట్‌కు వచ్చి కౌంటర్‌లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడుతూ.. సస్పెండెడ్ కాఫీ ఉందా అని అడిగాడు. వెంటనే కౌంటర్‌లో ఉన్న వ్యక్తి ‘ఎస్' అంటూ వేడి వేడి కాఫీని అందించింది. ఆ తర్వాత బాగా గడ్డం పెరిగి.. పేదవాడిలా కనిపించే మరో వ్యక్తి వచ్చి సస్పెండెడ్ మీల్ ఉందా అని అడిగితే.. ‘ఎస్‘ అంటూ వేడి వేడి భోజనం ప్యాక్ చేసిన పార్సిల్‌ను, ఓ వాటర్ బాటిల్‌ను అందించారు.

మానవత్వం అంటే అదే..
సమాజంలో పేదరికం, ఆకలితో బాధపడేవారు ఎవరో మనకు తెలియదు. వారి పరిచయం ఉండదు. వాళ్ల ముఖం తెలియదు. అలాంటి వారిని ఏదో రూపంలో ఆదుకోవడం కంటే సామాజిక సేవ మరోటి ఉంటుందా?. ఇలాంటి సహాయం యూరప్‌లోని కొన్ని దేశాల్లో జరుగుతున్నది. ఈ రకమైన స్వచ్ఛంద సేవ పలు దేశాలకు వేగంగా విస్తరిస్తున్నది. మనం కూడా ఇలాంటి సేవలందించే స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నాను అంటూ ఈ సేవ గురించిన కథను సింపుల్‌గా, అందరికీ అర్ధం అయ్యేలా కాజల్ అగర్వాల్ చెబుతూ ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











