twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోజు రోజుకూ పెరుగుతోందిగా! అందుకే కాజల్ ఇలా చేస్తుందేమో..

    |

    సినిమాలు చేస్తూనే పలు బిజినెస్‌లపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు నేటితరం హీరోహీరోయిన్లు. ఇప్పటికే రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి బాగా హీరోలు బిజినెస్ రంగం వైపు అడుగులు వేయగా అదే బాటలో హీరోయిన్లు సైతం ముందడుగు వేస్తుండటం గమనార్హం. తాజాగా ఈ లిస్టులో చేరిపోయిందట సీనియర్ హీరోయిన్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.

    సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. సౌత్ లోని అన్ని భాషా చిత్రాల్లో నటిస్తూ సోషల్ మీడియాలో కూడా రాణిస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు కాజల్ అగర్వాల్ సరికొత్తగా ఆలోచించి ఓ బిజినెస్ ప్రారంభించిందని తెలుస్తోంది. అది కూడా ముంబై వీధుల్లో. ముంబై నగరంలో కాజల్ జువెల్లరీ బిజినెస్ ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా కాజల్ ప్రారంభించిన ఈ బిజినెస్ పై భిన్నరీతిలో రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. రోజు రోజుకూ బంగారం ధర పెరుగుతుంది కాబట్టే కాజల్ ఈ రంగాన్ని ఎంచుకుంది కొందరంటుంటే.. అమ్మడికి ఇంకా పెళ్లే చేసుకోలేదు అప్పుడే ఎందుకింత ఆశ అని మరికొందరు చెప్పుకుంటున్నారు.

    Kajal Aggarwal Enters into Jewellery Business

    దాదాపు 15 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న కాజల్.. సౌత్ సినిమాల్లోని అందరు అగ్ర హీరోలతో ఆడిపాడింది. స్టార్ హీరోయిన్‌గా కీర్తించబడుతూ 50 సినిమాలు పూర్తిచేసింది. రెమ్మ్యూనరేషన్ పరంగా కూడా ఒక్కో సినిమాకు కోటిన్నర తీసుకుంటోంది కాజల్ అగర్వాల్. ఇటీవలే తేజ దర్శకత్వంలో సీతగా ప్రేక్షకుల ముందుకొచ్చిన కాజల్.. ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది. ప్రస్తుతం ఈమె పారిస్ పారిస్ చిత్రంలో నటిస్తోంది. అలాగే డైరెక్టర్ తేజతో మరో ప్రాజెక్ట్ చేయనుందని తెలుస్తోంది.

    English summary
    Kajal Aggarwal successfully completed 50 movies in her career. As per latest talk she enters into the Jewellery Business in Mumbai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X