కాజల్‌ని ఉతికేస్తున్నారుగా.. జీవ హింసతో వినోదమా!
స్టార్ సెలెబ్రిటీలకు సోషల్ మీడియాలో తరచుగా ట్రోలింగ్ ఎదురవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అనుకోని విధంగా స్టార్స్ ట్రోలింగ్ కి గురవుతుంటారు. తాజగా అందాల చందమామ కాజల్ అగర్వాల్ చిక్కుల్లో పడింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కాజల్ అని ఒక ఆట ఆడుకుంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతోంది.

కొండచిలువతో ఆటలు
షూటింగ్ లో భాగంగా కాజల్ అగర్వాల్ ఓ కొండచిలువని మేడలో వేసుకుని ఫోజులు ఇచ్చింది. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాజల్ భయపడుతూ క్యూట్ గా కనిపించడంతో భారీ స్థాయిలో ఈ వీడియోని షేర్ చేశారు.
జంతు ప్రేమికుల ఆగ్రహం
క్రమంగా కాజల్ అగర్వాల్ పై జంతుప్రేమికుల్లో ఆగ్రహం పెరిగింది. మూగ జంతువులని ఇలా వినోదం కోసం ఎలా ఉపయోగిస్తావు అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనపై జంతు సంరక్షన సంస్థ పెట కూడా స్పందించడం విశేషం. ఈ రోజుల్లో జంతువులని వినోదం కోసం ఉపయోగించుకునేవారు అధికం అవుతున్నారు. కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ ఇలా చేయడం జీవ హింసని ప్రోత్సాహించినట్లే అవుతుందని పెట సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.

జంతు ప్రేమికురాలే
పెట సంస్థకు చెందిన ప్రముఖ కార్యకర్త పాయల్ ఖురానా మాట్లాడుతూ.. కాజల్ పెట సంస్థ అంటే ఇష్టం. ఆమె కూడా జంతుప్రేమికురాలే. కానీ ఇలాంటి వీడియో పోస్ట్ చేయడం వలన విమర్శలు తప్పవని అన్నారు. ఇదే చిత్ర షూటింగ్ లో భాగంగా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా గతంలో జంతు ప్రేమికుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఏనుగు దంతాలపై
బెల్లంకొండ శ్రీనివాస్ ఏనుగు దంతాలపై కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే.దీనితో బెల్లంకొండ శ్రీనివాస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. ఆ ఘటన మరువక ముందే కాజల్ కూడా జంతు ప్రేమికుల నుంచి విమర్శలు ఎదుర్కొంది.


Click it and Unblock the Notifications











