కాజల్ కాపురం కోసం కళ్లు చెదిరే ఇల్లు.. పెళ్లికి ముందే ప్రియుడితో బ్యూటీ అలా.. (ఫోటోలు)
అందాల భామ కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నారు. కొద్ది సంవత్సరాలుగా ప్రేమిస్తున్న ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇటీవల ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే పెళ్లి తర్వాత కాపురం చేయడానికి ఓ ఇంటిని అందంగా ముస్తాబు చేసే పనిలో కాబోయే భర్త ఉన్నారు. ఆ ఇంటికి సంబంధించి, అలాగే కాబోయే భర్తతో డేటింగ్ చేస్తున్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల వెనుక ఉన్న కథ అదే అంటూ..

కాజల్ కాబోయే భర్త ఇంటీరియర్ డిజైనర్
కాజల్ అగర్వాల్ కాబోయే భర్త గౌతమ్ కిచ్లూ ముంబైలో మంచి పాపులారిటీ ఉన్న ఇంటీరియర్ డిజైనర్. ముంబైలో ఇంటి అలంకరణకు సంబంధించిన డిజైనింగ్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. పలు సెలబ్రిటీల ఆయనకు కస్టమర్లుగా ఉన్నారు. అయితే కాజల్‌తో పెళ్లి తర్వాత ఉండటానికి అందమైన గృహాన్ని డిజైన్ చేస్తున్నట్టు ఫోటోలు బయటకు వచ్చాయి.

అందంగా ముస్తాబవుతున్న ఇల్లు
ముంబైలో తన కోసం ఇంటిని తీర్చి దిద్దుతున్న సమయంలో కాజల్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. పెళ్లి తర్వాత కాపురం మొదలుపెట్టడానికి అందమైన ఇల్లు ముస్తాబవుతున్నది. మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? అలాగే కాబోయే ఆయన పనితీరు గుర్తించండి అంటూ ఓ వాట్సప్ స్టేటస్‌ను పెట్టింది.

రెండేళ్ల క్రితమే ప్రియుడితో కాజల్
ఇదిలా ఉండగా, గత రెండేళ్లుగా గౌతమ్ కిచ్లూతో కాజల్ డేటింగ్ చేస్తున్నారనే విషయం తాజాగా బయటకు వచ్చింది. గౌతమ్‌తో కలిసి కాజల్ ఓ స్నేహితురాలికి సంబంధించని ఫంక్షన్‌కు హాజరైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ట్విట్టర్‌లో ఈ ఫోటోను అభిమానులు భారీగా రీట్వీట్ చేయడం కనిపించింది.

అప్పుడే కాజల్ ఇంటిలో పెళ్లికళ
ఇక కాజల్ అగర్వాల్ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నట్టు సమాచారం. విజయదశమి పండుగ కూడా రావడంతో పెళ్లి కళ అప్పుడే ఇంటిలో కనిపిస్తున్నట్టు సమాచారం. పెళ్లిలో భాగంగా చేసే సంప్రదాయ కార్యక్రమాలు దసరా పండుగ తర్వాత మొదలుపెట్టే అవకాశం ఉందనే విషయం సన్నిహితులు చెబుతున్నారు.
Recommended Video

అత్యంత ఆత్మీయుల సమక్షంలో వివాహం
ఇక పెళ్లికి ముందు జరిగే మెహందీ, సంగీత్, హల్దీ ఫంక్షన్ల కోసం కాజల్ అగర్వాల్ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అతి కొద్ది మంది సమక్షంలో జరిగే పెళ్లి కోసం అత్యంత ఆత్మీయులను మాత్రమే ఆహ్వానించనున్నట్టు సమాచారం. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. కాజల్, గౌతమ్ పెళ్లి అక్టోబర్ 30న ముంబైలోని తన నివాసంలో నిరాడంబరంగా జరిపించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











