కాబోయే భర్త గౌతమ్‌తో కాజల్ అగర్వాల్ తొలి ఫోటో.. గోవాలో బ్యాచలర్‌ పార్టీ.. ఫోటోలు వైరల్!

యువ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ పెళ్లి ప్రకటన సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారడమే కాకుండా జాతీయ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రియుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబొతున్నట్టు ప్రకటించడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో శుభాభినందనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నది. ఆ ఫోటోను స్వయంగా కాజల్ అగర్వాల్ కాబోయే భర్త గౌతమ్ షేర్ చేస్తూ ఏమని కామెంట్ చేశారంటే..

లాక్‌డౌన్‌లోనే ఎంగేజ్‌మెంట్

లాక్‌డౌన్‌లోనే ఎంగేజ్‌మెంట్

దశాబ్దకాలానికి పైగా దక్షిణాది, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన కాజల్ అగర్వాల్‌కు లాక్‌డౌన్‌లో వివాహం జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆ తర్వాత లాక్‌డౌన్ నిరాడంబరంగా ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలం ఇరు కుటుంబాలకు ముఖ్యమైన కొందరు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోను గౌతమ్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ముంబైలో ఇంటీరియర్ డిజైన్ వ్యాపారవేత్తగా

ముంబైలో ఇంటీరియర్ డిజైన్ వ్యాపారవేత్తగా

గౌతమ్ విషయానికి వస్తే.. అమెరికాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన ఇంటీరియర్ డిజైనర్. ముంబైలో పలు ప్రాంతాల్లో లైఫ్ స్టయిల్‌కు చెందిన పలు వ్యాపార సంస్థలను అభివృద్ది చేశారు. గౌతమ్ ఇంటీరియర్ డిజైన్ షాపుల నిర్వహణ, డిజైనర్ ఫర్నీచర్‌ వ్యాపారాలను నిర్వహిస్తుంటారు. ఇంటిలో డెకరేటివ్, పెయింటింగ్స్, ఇతర గృహోపకరణాల వ్యాపారంలో ఉన్నారు.

ఎంగేజ్‌మెంట్ గౌతమ్ అభిరుచికి తగినట్టుగా

ఎంగేజ్‌మెంట్ గౌతమ్ అభిరుచికి తగినట్టుగా

తన అభిరుచికి తగినట్టుగానే ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో అలంకరణపై ప్రత్యేక శ్రద్ద తీసుకొన్నారు. బంగారు రంగు బెలూన్లను బ్యాక్ డ్రాప్‌‌గా రూపొందించారు. ఆ బెలూన్ల మధ్యన తన కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోను గౌతమ్ కిచ్లూ షేర్ చేశారు. ఒక బెలూన్ ఇమోజీని షేర్ చేశారు.

గౌతమ్ కిచ్లూ ఫోటోకు లవ్ సింబల్స్‌తో రియాక్షన్

గౌతమ్ కిచ్లూ ఫోటోకు లవ్ సింబల్స్‌తో రియాక్షన్

గౌతమ్ కిచ్లూ షేర్ చేసిన పోస్టుపై కాజల్ అగర్వాల్ స్పందించారు. తన ఫోస్టుకు లవ్లీగా స్పందిస్తూ.. రెండు హార్ట్ ఎమోజీలను పెట్టారు. అంతేకాకుండా గౌతమ్ నీ పోస్టు డిజైనింగ్‌లో నీ సృజనాత్మకతను గుర్తు చేస్తుంది. అద్భుతమైన సృజనాత్మకత ఉన్న నా కాబోయే భర్త అంటూ కామెంట్‌తో హ్యాష్ ట్యాగ్‌ను పెట్టింది.

Recommended Video

Kajal Aggarwal's Fiency Gautam Kitchlu's Net Worth Details
గోవాలో కాజల్ అగర్వాల్ బ్యాచ్‌లర్ పార్టీ

గోవాలో కాజల్ అగర్వాల్ బ్యాచ్‌లర్ పార్టీ


ఇదిలా ఉండగా, అక్టోబర్ 30న పెళ్లి గౌతమ్‌తో వివాహం జరుగుతుందనే విషయాన్ని వెల్లడించిన తర్వాత తన స్నేహితులతో ఘనంగా బ్యాచ్‌లర్ పార్టీ జరుపుకొన్నది. గోవాకు వెళ్లిన కాజల్ అగర్వాల్ తన స్నేహితులతో కలిసి విందులో మునిగి తేలింది. తన స్నేహితులతో దిగిన ఫోటోలను షేర్ చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X