Kajal: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ గురించి నోరు విప్పిన కాజల్.. అసలు విషయం బయటపెట్టేసిందిగా!

హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్స్ జాబితాలో ఒకరిగా నిలిచింది. అయితే కొత్త కొత్త హీరోయిన్ల ఎంట్రీతో కాజల్ తో సహా సీనియర్ హీరోయిన్లు అందరి పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. దీంతో కాజల్ తెలివిగా పెళ్లి చేసుకుంది. అయితే ఆమె ప్రెగ్నెన్సీ గురించి అనేక వార్తలు బయటకు వస్తున్న తరుణంలో ఆమె ఎట్టకేలకు నోరు విప్పింది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రియుడు గౌతమ్

ప్రియుడు గౌతమ్

తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ చాలాకాలంపాటు తెలుగు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే కొత్త హీరోయిన్ల ఎంట్రీతో పాటు గోల్డెన్ లెగ్ గా భావిస్తున్న కొంతమంది హీరోయిన్లు డామినేషన్ తో కాజల్ అగర్వాల్ ఫేమ్ కాస్త తగ్గినట్టు అనిపించడంతో ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రియుడు గౌతమ్ ను వివాహం చేసుకుంది..

 మరిన్ని అవకాశాలు

మరిన్ని అవకాశాలు

అనూహ్యంగా గౌతమ్ ని వివాహం చేసుకున్నాక ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే ఈ మధ్యకాలంలో కాజల్ ప్రెగ్నెన్సీ గురించి అనేక వార్తలు తెరమీదకు వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం గర్భవతి గా ఉందని అందుకే కొన్ని సినిమాలు ఒప్పుకున్నాక కూడా ఇప్పుడు అడ్వాన్స్ లు వెనక్కి ఇచ్చేసి సినిమాల నుంచి తప్పుకుంది అని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

ప్రెగ్నెన్సీ గురించి

ప్రెగ్నెన్సీ గురించి

తాజాగా ఈ విషయం గురించి నోరువిప్పిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ గురించి తను మాట్లాడాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పింది. అయితే సమయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడతానని పేర్కొన్న కాజల్ మాతృత్వం అనేది చాలా గొప్ప విషయం అని నాకు సంబంధించినంత వరకు ఓవైపు ఎగ్జైట్మెంట్ కలిగిస్తూనే నెర్వస్ గా కూడా అనిపిస్తుంది అని ఆమె వెల్లడించింది.

గమనిస్తున్నా

గమనిస్తున్నా

నేను నా చెల్లెలు నిషా తల్లి అయినప్పుడు ఆమె ఎలాంటి ఫీలింగ్స్ వేసిందో దగ్గరనుంచి గమనించాను అని కాజల్ వెల్లడించింది. తల్లి అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో కూడా గమనిస్తున్నానని ఆమె పిల్లలు ఇషాన్, కబీర్ ఇద్దరితో ఎక్కువ సమయం గడిపానని ఆమె వెల్లడించింది. ఆ సమయంలో వారికి తల్లిలాగా భావిస్తానని అదే భావనలో ఉంటూ వారితో గడుపుతాను అని చెప్పుకొచ్చింది. ఆ పిల్లలిద్దరూ నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు కొత్త భావన కలిగింది అని అదే ఇప్పుడు నాకు పిల్లలు పుడితే ఎలా ఉంటుంది అని నాలో కొత్త ఎమోషన్ ను ఇంకా పెంచుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.

Recommended Video

Bigg Boss Telugu 5 : ఈ వారం ట్విస్ట్ ఇదే..!! || Filmibeat Telugu
ఆచార్య సినిమాలో

ఆచార్య సినిమాలో

సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా కాకుండా తమిళ. హిందీ భాషలలో కూడా సినిమాలు చేస్తోంది. ఆమె చేసిన ఉమా అనే బాలీవుడ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X