నమ్మించి హ్యాండిచ్చిన కాజల్.. దిక్కుతోచని స్థితిలో యంగ్ డైరెక్టర్‌

Recommended Video

Is Kajal Aggarwal Troubling Young Tollywood Director ? | Filmibeat Telugu

వరుస విజయాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది కాజల్ అగర్వాల్. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది టాలీవుడ్ చందమామ.. ఇప్పుడు మాత్రం దానికి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు హిట్‌లు లేక మరోవైపు అవకాశాలు రాక ఇబ్బంది పడుతోంది. వచ్చిన అవకాశాలను కూడా జార విడుచుకుంటోంది. తేజ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత హిట్ అనే మాటను వినలేకపోయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం వ్యవహిరిస్తున్న తీరుకు తెలుగు సినీ ఇండస్ట్రీ షాక్ అవుతోంది.

రాజుగారి గది -3 ఆఫర్

రాజుగారి గది -3 ఆఫర్

దర్శకుడు ఓంకార్ సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ‘రాజుగారి గది 3'లో హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నాను అనుకున్నారు. షూటింగ్ మొదలుపెట్టాలి అనుకుంటున్న సమయంలో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక చిత్ర యూనిట్ తాప్సీని ఫైనల్ చేసినట్లు మరో టాక్ వచ్చింది. కానీ, ఆమె కూడా చేయననడంతో కాజల్ పేరు తెరపైకి వచ్చింది.

భారీ రెమ్యూనరేషన్ అడగడంతో

భారీ రెమ్యూనరేషన్ అడగడంతో

అనుకున్న ఇద్దరు హీరోయిన్లు హ్యాండ్ ఇవ్వడంతో ‘రాజుగారి గది 3' దర్శకుడు ఓంకార్ కాజల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు చేయడానికి ముందు ఓకే చెప్పిందట కాజల్. అయితే, అందుకోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిందట. దీంతో షాకైన ఓంకార్ చేసేదేం లేక వెనుదిరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె మాత్రం వచ్చిన అవకాశాన్ని ఇలా వదులుకోవడం చర్చనీయాంశం అయింది.

 ప్రశాంత్ వర్మ సినిమాలో..

ప్రశాంత్ వర్మ సినిమాలో..

తాజాగా కాజల్ గురించి మరో వార్త బయటకు వచ్చింది. ‘అ!' సినిమాతో ఇండస్ట్రీని తన వైపునకు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా ‘కల్కి' అనే సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలూ అంతగా ఆడకపోయినా.. ప్రశాంత్‌లోని నైపుణ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాయి. ఇప్పుడు ఇతడి సినిమాలోనే కాజల్ నటిస్తోంది.

ఇప్పుడు మరో షాకింగ్ డెసిషన్

ఇప్పుడు మరో షాకింగ్ డెసిషన్

కాజల్ ఈ సినిమాలో నటిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించబోతుందని ప్రచారం జరిగింది. ఈ సినిమాతో తన ప్రొడక్షన్‌ హౌజ్‌ను ప్రారంభించే అవకాశం ఉందన్న టాక్‌ వినిపించింది. ఈ మేరకు ఆమె కూడా డైరెక్టర్‌కు హామీ ఇచ్చిందట. అయితే, ఇప్పుడేమో కాజల్ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ షాక్ అయ్యాడని టాక్.

 ప్రస్తుతం చేస్తున్న సినిమా

ప్రస్తుతం చేస్తున్న సినిమా

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగులో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘రణరంగం'లో చేస్తోంది. ఈ సినిమా మినహా తెలుగులో మరో సినిమాను ఓకే చేయలేదు. అయితే, వేరే భాషల్లో మాత్రం పలు చిత్రాలను చేస్తోంది. అలాగే, త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X