Acharya సినిమాకు కాజల్ రెమ్యునరేషన్ ఎంతంటే.. మధ్యలోనే తొలగించడంతో..

మెగా మల్టీస్టారర్ మూవీ మూవీ ఆచార్య నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు అనుకున్నంతగా పాజిటివ్ టాక్ అయితే ఏమీ రావడం లేదు. ప్రీమియర్ షోల నుంచే డివైడ్ టాక్ రావడంతో సినిమా రిజల్ట్ పై కూడా అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమాలో నటించిన కాజల్ అగర్వాల్ ను దర్శకుడు కొరటాల శివ కొన్ని రోజుల షూటింగ్ అనంతరం తప్పించినట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే కాజల్ కు మాత్రం ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం పారితోషికం ఎలాంటి విభేదాలు చూపించకుండా ఆమె డిమాండ్ కి తగ్గట్టుగా ఫుల్ పేమెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదటిసారి ఇలా..

మొదటిసారి ఇలా..

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏళ్లు గడుస్తున్నా కూడా ఒకే తరహా ఇమేజ్ తో ముందుకు సాగుతోంది. ఆమెకు కెరీర్లో విజయాలతో పాటు అపజయాలు కూడా చాలా ఉన్నప్పటికీ కూడా కాజల్ కెరీర్ పై పెద్దగా ప్రభావం పడలేదు. అయితే కాజల్ అగర్వాల్ ను మొదటి సారి తన కెరీర్లో ఒక సినిమాలో నటించిన తర్వాత తొలగించడం జరిగింది.

సినిమాకు అవసరం లేదని..

సినిమాకు అవసరం లేదని..

మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ నటించిన ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ మెగాస్టార్ కు జంటగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగిన కొన్ని రోజులకే కాజల్ అగర్వాల్ ను దర్శకుడు కొరటాల తొలగించాడు. చిత్ర యూనిట్ సభ్యులతో మాట్లాడి అలాగే మెగాస్టార్ చిరంజీవి తో కూడా మాట్లాడిన అనంతరం కాజల్ అగర్వాల్ పాత్ర సినిమాకు అనవసరం లేదని తొలగించారు.

అందుకే కాజల్ పాత్ర డిలీట్

అందుకే కాజల్ పాత్ర డిలీట్

మంచి స్టార్ హీరోయిన్ అయినటువంటి కాజల్ అగర్వాల్ ను అనవసరంగా కొన్ని అర్థంలేని సన్నివేశాల కోసం తీసుకోకూడదని ఆమె పాత్రను తొలగించినట్లు దర్శకుడు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ షూటింగ్ లో అయితే కేవలం ఐదు రోజుల్లోనే పాల్గొందట. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన పాటలో కూడా ఆమె కనిపించిన విషయం తెలిసిందే.

5 రోజులకు ఫుల్ పేమెంట్

5 రోజులకు ఫుల్ పేమెంట్

ఇక ఆమె కొన్ని రోజులే నటించినప్పటికీ కూడా ఆమెకు ఇవ్వాల్సిన పేమెంట్ మొత్తం ఇచ్చినట్లు సమాచారం. మొత్తం 20 రోజుల షెడ్యూల్ కోసం కాజల్ డేట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె కేవలం ఒక ఐదు రోజుల షూటింగ్ లోనే పాల్గొన్నప్పటికీ కూడా ఆమె కు తగ్గట్టుగా మార్కెట్ డిమాండ్ ను బట్టి ఒకటిన్నర కోటి రూపాయలు ఇచ్చినట్లు సమాచారం.

అసలు కాజల్ రెమ్యునరేషన్ ఎంత?

అసలు కాజల్ రెమ్యునరేషన్ ఎంత?

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సాధారణంగా ఒక్కో సినిమాకు రెండు కోట్లకు పైగానే డిమాండ్ చేస్తోందట. ఇక ఆమె ఆచార్య సినిమాకు కాస్త తక్కువగానే డిమాండ్ చేసింది. షూటింగ్ ను పూర్తిస్థాయిలో కవర్ చేయక పోయినప్పటికీ న్యాయమైన పారితోషికం అందుకున్నట్లుగా చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కాజల్ అగర్వాల్ తొలగించినప్పటికీ ఆచార్య సినిమా అంచనాలకు తగ్గట్టుగా దర్శకుడు తెరకెక్కించలేకపోయాడు అని ఓ వర్గం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X