twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోను.. కాజల్ అగర్వాల్!

    |

    అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. మూడు పదుల వయసులో కూడా హీరోయిన్ గా క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ ఎక్కడకు వెళ్లినా మీడియా నుంచి పెళ్లెప్పుడనే ప్రశ్న కామన్ గా ఎదురవుతూ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లి విషయంలో కాజల్ మరోమారు క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే అని కాజల్ అగర్వాల్ తెలిపింది.

    చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోను. నాకు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. వాళ్లెవరిని నా జీవిత భాగస్వామిగా ఊహించుకోలేదు. అందుకే పెళ్లి విషయంలో మాత్రం బయటి వ్యక్తినే ఎంచుకుంటా అని కాజల్ అగర్వాల్ తెలిపింది. సినిమాల్లోకి రాకముందు తాను ఓ వ్యక్తిని ప్రేమించానని కాజల్ అగర్వాల్ ఓ సందర్భంలో తెలిపింది. సినీరంగంలోకి ప్రవేశించాక అతడితో బ్రేకప్ అయిందని తెలిపింది.

     Kajal Aggarwal gives clarity about her marriage plannings

    కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. తేజ దర్శత్వంలో సీత అనే చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శత్వంలో కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 చిత్రంలో నటిస్తోంది. భారతీయుడు 2లో కాజల్ అగర్వాల్ డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Kajal Aggarwal gives clarity about her marriage plannings
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X