కాజల్ అగర్వాల్ అందాల విందు: పెళ్లి తర్వాత తొలిసారి ఇలా.. ఘాటు ఫోజుతో కవ్విస్తోన్న చందమామ!

చూపు తిప్పుకోకుండా చేయగలిగే అందం.. అంతకు మించిన యాక్టింగ్‌తో దాదాపు దశాబ్దా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది చందమామ కాజల్ అగర్వాల్. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించింది. అయితే, ఈ మధ్య స్పీడు తగ్గించేసింది. అయినా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా కాజల్ అగర్వాల్ హాట్ ఫొటోను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం దానిపై మీరూ లుక్కేయండి!

‘లక్ష్మీ కల్యాణం' నుంచి మొదలైంది

‘లక్ష్మీ కల్యాణం' నుంచి మొదలైంది

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'లక్ష్మీ కల్యాణం' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది కాజల్ అగర్వాల్. ఆరంభంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకున్న ఈ బ్యూటీ.. వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఫలితంగా స్టార్ హీరోయిన్ అయింది. ఇక, రెమ్యూనరేషన్ కూడా భారీగా తీసుకుంది.

 రెండు తరాల హీరోలతో సినిమాలు

రెండు తరాల హీరోలతో సినిమాలు

తెలుగులో కాజల్ అగర్వాల్‌కు మాత్రమే సొంతమైన ఓ రికార్డు అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. గతంలో రామ్ చరణ్‌తో పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150'లో ఆయన సరసన చేసింది. తద్వారా కొడుకు తర్వాత తండ్రి సినిమాలో చేసిన ఏకైక హీరోయిన్‌గా నిలిచింది. అదే సమయంలో రెండు తరాల హీరోలతో చేసి సత్తా చాటింది.

అప్పుడలా.. ఇప్పుడిలా.. తగ్గట్లేదు

అప్పుడలా.. ఇప్పుడిలా.. తగ్గట్లేదు

ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ఆమె నటించిన సినిమాలు చాలా వరకు హిట్లుగా నిలుస్తుండడంతో ఫిల్మ్ మేకర్లు ఆమె డేట్స్ కోసం వేచి చూసేవారు. అయితే, ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాజల్ చేసిన సినిమాలు మధ్యలోనే ఆగిపోవడమో.. ఫ్లాప్ అవడమో కారణంగా అవకాశాలు సన్నగిల్లిపోయాయి.

కాజల్ ప్రేమ వివాహం... బ్రేక్ లేదు

కాజల్ ప్రేమ వివాహం... బ్రేక్ లేదు

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే కాజల్ అగర్వాల్.. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు‌తో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు రహస్యంగా అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత 2020 అక్టోబర్ 30న అతడిని వివాహం చేసుకుంది. అయితే, చాలా మందిలా పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకోకుండా.. తన కెరీర్‌ను కొనసాగిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోందామె.

చెల్లెలి పాత్రలో... చిరంజీవి సినిమా

చెల్లెలి పాత్రలో... చిరంజీవి సినిమా

వివాహం తర్వాత కాజల్ అగర్వాల్ నటించిన 'మోసగాళ్లు' సినిమా విడుదలైంది. భారీ రేంజ్‌లో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇందులో ఆమె మంచు విష్ణుకు సోదరిగా నటించింది. ఇక, ప్రస్తుతం కాజల్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య'లో హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే ఆమె పార్ట్ షూటింగ్ కూడా పూర్తైంది. అలాగే, నాగార్జునతోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 అందులో ఎప్పుడూ బిజీగా ఉంటూ

అందులో ఎప్పుడూ బిజీగా ఉంటూ

సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించడంతో పాటు అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా నిత్యం హాట్ టాపిక్ అవుతూ ఉంటోంది.

Recommended Video

BA Raju : Mahesh Babu కి Loyal PRO, Tollywood Encyclopaedia || Filmibeat Telugu
పెళ్లి తర్వాత కాజల్ అందాల విందు

పెళ్లి తర్వాత కాజల్ అందాల విందు

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండే కాజల్ అగర్వాల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు హాట్ లుక్‌తో కనిపిస్తోంది. స్లీవ్‌లెస్ డ్రెస్‌తో అందాలను చూపిస్తూ కనువిందు చేస్తోంది. పెళ్లి తర్వాత ఇలాంటి ఫొటో షేర్ చేసి ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది. దీంతో ఈ పిక్‌కు ఇప్పటికే మిలియన్‌కు పైగా లైకులు వచ్చాయి. దీంతో ఇది వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X