ఎట్టకేలకు ఓపెన్ అయిపోయిన కాజల్ భర్త.. ఆమె ఫాన్స్ అందరికీ గుడ్ న్యూస్.. ఏమైదంటే?

కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుంది. ఆమె భర్త గౌతమ్ కిచ్లూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలియజేశారు. కాజల్ అగర్వాల్ గర్భవతి అని.. ఎట్టకేలకు ఈ జంట ధృవీకరించారు. ఆ వివరాల్లోకి వెళితే

Recommended Video

2021 Year Ender : Tollywood Stars Tied Knot In 2021 | Filmibeat Telugu
అభిమానులకు షాకిచ్చి

అభిమానులకు షాకిచ్చి

కాజల్‌ అగర్వాల్‌ 2020 అక్టోబర్‌లో ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకుంది. పెళ్లికి ముందే వీరిద్దరు ప్రేమించుకున్నా, డేటింగ్‌లో ఉన్నా కానీ ఆ విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచింది కాజల్‌. అనూహ్యంగా తన ప్రేమ, పెళ్లి విషయాన్ని ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది కాజల్‌.

తల్లి కాబోతోందని అంటూ

తల్లి కాబోతోందని అంటూ

నటి కాజల్ అగర్వాల్ గర్భవతి అని కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఆమె సినిమాలు చేయకపోవడం, తెలుగులో నటించాల్సిన ఘోస్ట్ మూవీ నుంచి తప్పుకుందనే వార్తల నేపథ్యంలో ప్రెగ్నెంట్‌ కారణంగానే ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుందనే వార్త ఊపందుకుంది. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ ఇన్​స్టా వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. కాజల్ అగర్వాల్ గర్భవతి మరియు ఆమె 2022 సంవత్సరంలో తల్లి కాబోతోందని అంటూ ఆయన హింట్ ఇచ్చారు.

ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీ

ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీ

గౌతమ్ కిచ్లూ ఇన్‌స్టాగ్రామ్‌లో కాజల్ అగర్వాల్ ఫోటోను పంచుకున్నారు. ఆ ఫోటోలో ఆమె ఎల్లో కలర్ డ్రెస్ లో చాలా అందంగా ఉంది. ఇందులో, కాజల్ అగర్వాల్ టేబుల్‌పై కూర్చుని ఆమె కెమెరా వైపు చూస్తోంది. కాజల్. అగర్వాల్ చేతుల్లో చెవిపోగులు, ఉంగరాలు ధరించి ఫోటోలలో చాలా అందంగా ఉంది.

నటి ఫోటోను పంచు కోవడంతో పాటు, గౌతమ్ ఇలా రాశాడు- '2022, ఇప్పుడు మేము మీ కోసం ఎదురు చూస్తున్నాం, అని పేర్కొనడమే కాక గౌతమ్ ప్రెగ్నెంట్ లేడీ' ఎమోజీని షేర్ చేశాడు. గౌతమ్ ఇంతలా పంచు కోవడం ఆలస్యం, వారిద్దరికీ అభినందనలు మొదలయ్యాయి. అంద‌రూ ఆమెకు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

బేబీ బంప్‌ను చూపిస్తూ

బేబీ బంప్‌ను చూపిస్తూ

కాజల్ అగర్వాల్ శుక్రవారం నాడు కూడా గౌతమ్ కిచ్లూతో కలిసి ఒక ఫోటోను పంచుకున్నారు. ఇద్దరూ బేబీ బంప్‌ను చూపిస్తూ కనిపించారు. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ థాయ్ హై స్లిట్ గౌనుతో కూడిన ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించారు. ఆ ఫోటో పంచుకుంటూ, కాజల్ అగర్వాల్ క్లొన్ని కామెంట్లు చేసింది. ఇంతకు ముందు, వారిద్దరూ ఇటీవల తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.

వారిద్దరూ 2020 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కరోనా నిబంధనల ప్రకారం వివాహం చేసుకున్నారు. కొంతమంది ప్రత్యేక స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో ఇది జరిగింది.

సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే వివాహం తర్వాత కూడా ఆమె నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 'ఆచార్య', 'భారతీయుడు-2' సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి అయింది.. అయితే, ప్రెగ్నెంట్‌ కావడంతో 'భారతీయుడు-2' నుంచి ఆమె తప్పుకొన్నారని సమాచారం. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X