స్విమ్మింగ్ పూల్‌లో సవారి.. బికినీ అందాలతో ఫ్యాన్స్‌కు కాజల్ ట్రీట్

అందాల చందమామ, కలువ కళ్ల భామ కాజల్ అగర్వాల్. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన కాజల్.. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఓ ఊపు ఊపేసింది. ఇక్కడ వచ్చిన క్రేజ్‌తో బాలీవుడ్‌లో ఆఫర్లను పట్టేసింది. అయితే అక్కడ అంతగా సక్సెస్ కాలేకపోయింది. మళ్లీ తిరుగుపయనం కట్టి కోలీవుడ్, టాలీవుడ్ ప్రదక్షిణాలు చేస్తోంది.

ఆఫర్లు లేక ఖాళీ..

ఆఫర్లు లేక ఖాళీ..

ఒకప్పుడు క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపిన కాజల్.. విహార యాత్ర అంటూ ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తోంది. సీనియర్ హీరోల పక్కన మంచి చాయిస్‌గా ఉన్న కాజల్‌కు.. అటు వైపు నుంచి కూడా అవకాశాలు రావడం లేదు. శంకర్ దర్శకత్వంలో రాబోతోన్న భారతీయుడు 2 చిత్రంలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ మూవీ ఆలస్యం కావడం, మధ్యలో కాజల్‌ను తీసేశారనే రూమర్స్ రావడం కూడా జరిగింది. మొత్తానికి ఆ ప్రాజెక్ట్ చేజారిపోలేదని కాజల్ ప్రకటిచింది.

షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్..

షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్..

అవుట్ డేటెడ్ హీరోయిన్ల మాదిరి షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తుంది. ప్రకటనలు, మాల్స్ ఓపెనింగ్‌తో బాగానే సంపాదిస్తున్న కాజల్‌కు సినీ అవకాశాలు లేకపోవడం ఆశ్చర్యకర అంశం. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం కాలమైనా.. ఇంకా గట్టిగానే నిలబడటం చెప్పుకోదగ్గ విషయమే. రీసెంట్‌గా వచ్చిన సీత సినిమా సక్సెస్ అయితే ఆమె కెరీర్ ఇంకోలా ఉండేది.

ఆ వార్తలపై సీరియస్..

ఆఫర్లు లేక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌లో బిజీ అయిన కాజల్‌కు అక్కడా తలనొప్పి తగ్గడం లేదు. తాజాగా ఓ మాల్ ఓపెనింగ్ వెళ్లిన కాజల్‌కు పెళ్లికి సంబంధించిన ప్రశ్న కోపాన్ని తెప్పించింది. తన పెళ్లితో వ్యాపారాలు చేసుకోకండిని అసహనం వ్యక్తం చేసింది. తనకు పెళ్లి కుదిరిందనే వార్తల్లో నిజం లేదనీ, తానెప్పుడు పెళ్లి చేసుకోవాలో తనకు బాగా తెలుసునని చెప్పుకొచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు మీ అందరికీ చెబుతానంటూ ఫైర్ అయింది.

 బికినీలో అందాల ఆరబోత..

బికినీలో అందాల ఆరబోత..

కాజల్ అగర్వాల్ బికినీ అందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అందులోనూ తన ప్రతిభను ప్రదర్శించింది. నేరుగా పోజు పెట్టి అందాలను ప్రదర్శించకుండా.. కనిపించీ కనిపించకుండా చూపించేసింది. కాజల్ ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను కూడా జరుపుకోబోతోందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X