హాలీవుడ్‌లోకి కాజల్ అగర్వాల్.. టాలీవుడ్ ప్లాఫ్ హీరో నిర్మాతగా మూవీ.. లేటు వయసులో ధమాకా..

టాలీవుడ్ తారలు కాజల్ అగర్వాల్, మంచు విష్ణు హాలీవుడ్‌లో హంగామా సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. త్వరలో హాలీవుడ్‌లో మంచు విష్ణు చేయబోతున్న ప్రాజెక్ట్‌కు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇద్దరు తారలు చేపట్టిన అంతర్జాతీయ ప్రాజెక్ట్ మీడియాలో సంచలనం రేపుతున్నది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సత్తా చాటుతున్న కాజల్ అగర్వాల్ త్వరలోనే హాలీవుడ్‌కు వెళ్లడం సిని వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

శంకర్, కమల్‌కు షాకిచ్చిన

శంకర్, కమల్‌కు షాకిచ్చిన

కాజల్ అగర్వాల్ లేటు వయసులో ఇన్ని భాషల్లోనూ హల్‌చల్ చేస్తున్నది. ఇక వయసు అయిపోయింది ఆమె కెరీర్ ప్యాకప్ అనే వారికి ఈ ముదురు భామ షాకిస్తున్నది. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా తమిళ, హిందీ భాషల్లో సత్తా చాటుతున్నది. ఇటీవల ప్రారంభం కావాల్సిన ఇండియన్ 2 నుంచి తప్పుకోవడంపై చర్చ జరిగింది. చాలా రోజులు వెయిట్ చేసిన ఈ ముద్దుగుమ్మ శంకర్, కమల్ హాసన్ ప్రాజెక్ట్‌ను వదిలేసుకోవడంపై ఎన్నో రకాల కామెంట్లు విసిరారు.

లేటు వయసులో డబుల్ ధమాకా..

లేటు వయసులో డబుల్ ధమాకా..

అయితే మంచు విష్ణు ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న ఓ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోసం కాజల్ అగర్వాల్ అలాంటి ఛాలెంజింగ్ నిర్ణయాన్ని తీసుకొన్నట్టు సమాచారం. మంచు విష్ణు రూపొందించే బోయే సినిమా కథ కాజోల్‌ను చాలా ఇంప్రెస్ చేయడంతో వెంటనే ఒప్పేసుకొందట. కథను మరింత ప్రభావవంతంగా తీర్చే దిద్దేందుకు తుది మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం.

హ్యపీగా కాజల్ అగర్వాల్

హ్యపీగా కాజల్ అగర్వాల్

స్క్రిప్టుకు సంబంధించి కాజల్ అగర్వాల్ చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ఇతర అంశాలకు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయి. లుక్‌పరంగా క్రేజీగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఈ చిత్రంలో కాజల్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని తెలుస్తున్నది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు.

టాప్ హీరోయిన్ల సరసన కాజల్

టాప్ హీరోయిన్ల సరసన కాజల్

హాలీవుడ్ చిత్రంలో నటించేందుకు నిర్ణయం తీసుకోవడం ద్వారా కాజల్ అగర్వాల్ ఓ అరుదైన ఘనతను సాధించారు. ప్రియాంక, దీపికా పదుకోన్, శోభన, పూజా కుమార్ సరసన చేరారు. గతంలో వీరిద్దరు భామలు హాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో అగ్రతారగా పేరును సంపాదించుకొన్న కాజల్ హాలీవుడ్‌లో కూడా ఎలాంటి స్థానం సంపాదించుకొంటుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X