Just In
Don't Miss!
- News
Tractor rally: ట్రాక్టర్ల నెంబర్లు రాసుకున్న పోలీసులు, అమ్రేష్ పురి టైపులో ఓం భ్రీమ్ బ్రుష్!
- Sports
సైనీ గాయం గురించి మర్చిపోయా.. మూడో పరుగు కోసం రమ్మన్నాను! అంతలోనే: పంత్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ విషయంలో సరిలేరు నీకెవ్వరు.. అందుకే దక్షిణాదికి క్వీన్.. ఎంతైనా కాజల్ రేంజ్ వేరు!!
హీరోలైనా, హీరోయిన్లైనా సరే ప్రస్తుతం వారి స్టామినాను సోషల్ మీడియా ఫాలోవర్స్‌తోనే లెక్కిస్తున్నారు. ఎవరికీ ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే వారే గొప్పొళ్లన్న ఫీలింగ్‌ను ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ హీరో ఆధిపత్యమే కనిపించాలని ఫ్యాన్స్ నానా తంటాలు పడుతున్నారు. ఇందులో భాగంగానే బర్త్ డే ట్రెండ్స్, అడ్వాన్స్ బర్త్ డే, కామన్ డీపీ ట్రెండ్స్ నానా రచ్చ చేస్తుంటారు. అయితే ఇది ఇంతవరకు హీరోల వరకే ఉండేది. కానీ ఈ మధ్య హీరోయిన్ల ఫ్యాన్స్ కూడా ఈ యుద్దాన్ని ప్రకటిస్తున్నారు.

బర్త్ డేల ట్రెండ్స్..
ప్రస్తుతం రికార్డులంటే కేవలం సోషల్ మీడియా రికార్డులే అన్నట్టుగా మారిపోయింది. బర్త్ డే ట్రెండ్ చేయడం, వరల్డ్ రికార్డులు కొట్టడమే ఫ్యాన్స్ పనిగా పెట్టుకుంటున్నారు. ఈ మధ్య మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దమే జరిగింది. మహేష్ ఫ్యాన్స్ రికార్డులను పవన్ అభిమానులు చెరిపేశారు.

హీరోయిన్లలోనూ..
కాజల్, సమంత, తమన్నా బర్త్ డేలు, వారి కామన్ డీపీలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. హీరోయిన్ల ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా రికార్డులపై గురి పెడుతున్నారు. అందుకే తమ హీరోయిన్‌కు ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారంటే కాదు కాదు మా హీరోయిన్‌కే ఎక్కువ ఫాలోయింగ్ ఉందంటూ పోటీ పడుతుంటారు.

దక్షిణాది క్వీన్..
ప్రస్తుతం దక్షిణాది సూపర్ స్టార్ ఎవరని అడిగితే వెంటనే నయనతార, సమంత అంటూ టక్కున చెప్పేస్తారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం సౌత్ క్వీన్ కాజల్ అగర్వాలే. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్‌తో నెంబర్ వన్ స్థానంలో నిల్చింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం ఫాలోవర్స్ అన్నింటిని లెక్కలోకి తీసుకుంటే కాజల్ అందరికంటే ఎంతో ముందంజలో ఉంది.

టాప్‌లో కాజల్..
సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న వారిలో కాజల్ 42 మిలియన్ల ఫాలోవర్స్‌తో ముందంజలో ఉంది. ఇక తరువాత వరుసగా సమంత (28.5మి), రకుల్ (27.6మి), అనుష్క (17.6మి), తమన్నా (15.9), ఇలియానా (15.5మి), కీర్తి సురేష్ (15మి) ఉన్నారు. ఏది ఏమైనా కాజల్ మాత్రం అందరి కంటే ఎంతో ముందుంది. అందుకు దక్షిణాది క్వీన్ అయింది మరి.