పెళ్లి అంటూ చెప్పకనే చెప్పేసింది.. అభిమానుల గుండెల్ని బద్దలు కొట్టిన కాజల్ పోస్ట్

ఒక్కొసారి వివరాలు పూర్తిగా చెప్పకపోయినా విషయం ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రేమలో పడటం, బ్రేకప్ విషయం, పెళ్లి విషయం వంటి వాటిలో విడమరిచి చెప్పనక్కర్లేదు. అందరికీ ఇట్టే అర్థమవుతుంది. నిన్న వచ్చిన వార్తలు, జాతీయ మీడియా సైతం ఆ వార్తలను హోరెత్తించడంతో కాజల్ పెళ్లి నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. కొందరు మాత్రం అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు కూడా. అయితే కాజల్ చేసిన ఒక్క పోస్ట్ మాత్రం కొందరిలో ఆందోళన, ఇంకొందరిలో ఆసక్తి, మరికొందరిలో సంతోసాన్ని నింపింది.

Recommended Video

Actress Kajal Aggarwal to Marry Businessman gautam Kitchlu Very Soon || Oneindia Telugu
 పెళ్ళి వార్తలు వైరల్..

పెళ్ళి వార్తలు వైరల్..

లాక్ డౌన్‌లో కాజల్‌కు పెళ్లి ఫిక్స్ అయిందని, నిశ్చితార్థం కూడా అయిపోయిదంటూ వార్తలు వచ్చాయి. కాజల్‌పై ఇలాంటి వార్తలు మామూలుగానే వస్తుంటాయి. అయితే నిన్న మాత్రం ఒకేసారి అంతటా వైరల్ అయ్యాయి. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోబోతోందని వార్తలు చక్కర్లు కొట్టాయి.

 వరుడి వివరాలివే..

వరుడి వివరాలివే..

లాక్ డౌన్ ముగిసిన తర్వాత ముంబైలో కాజల్ నివాసం దగ్గర ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో వాళ్ల పెళ్లి జరగనుందని కూడా బయటకు వచ్చింది. వరుడి ప్రోఫైల్ కూడా నెట్టింట్లో వైరల్ అియంది. కాజల్‌ది అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అని, గౌతమ్ కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ లో చదువుకున్నాడని, డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోకి ఫౌండర్ అని ఓ చిట్టా కూడా వైరల్ అవుతోంది.

కాజల్ పోస్ట్ వైరల్..

కాజల్ పోస్ట్ వైరల్..

ఓ వైపు పెళ్లి వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతుంటే.. నిన్న సాయంత్రం తీరిగ్గా కాజల్ ఓ పోస్ట్ చేసింది. ఏమీ చెప్పకుండా ఏమీ రాయకుండా కేవలం లవ్ సింబల్‌ను పోస్ట్ చేసింది. దీంతో అందరి గుండె బద్దలైనంత పనైంది. కామెంట్లలో అభిమానులు విలావిలా కొట్టుకుంటున్నారు. కొందరైతే ఏకంగా కన్నీరు కూడా పెట్టుకుంటున్నారు.

 రకరకాలు కామెంట్లు..

రకరకాలు కామెంట్లు..

పెళ్లి చేసుకోబోతోన్నావట కదా కాజల్ కంగ్రాట్స్ అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే. వద్దు డోంట్ మ్యారీ మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్లకు అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక కామెంట్ సెక్షన్ ఎక్కువ సంఖ్యలో తెలుగు అభిమానులు మాత్రమే స్పందిస్తుండటంతో టాలీవుడ్‌లో ఆమె క్రేజ్ ఏపాటిదో అర్థమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X