భారతీయుడు2 కోసం ప్రాచీన యుద్ధ విద్య నేర్చుకుంటున్న కాజల్!
మనదేశంలో శత్రువులని మట్టికరిపించడానికి అనేక యుద్ధవిద్యలు ఉన్నాయి. ప్రముఖమైన యుద్ధ విద్యల్లో వర్మ కళ కూడా ఒకటి. భారతీయుడు చిత్రంలో కమల్ హాసన్ వర్మ కళని ప్రదర్శించే సన్నివేశాల్లో అద్భుతంగా నటించారు. వృద్ధుడి పాత్రలో కమల్ హాసన్ చేసిన పోరాట సన్నివేశాలు అప్పట్లో సినీ జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. భారతీయుడు 2 లో కూడా దర్శకుడు శంకర్ వర్మ కళకు సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరించబోతున్నారు.
అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా వర్మ కళ సన్నివేశాల్లో నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. వర్మ కళకు సంబంధించిన శిక్షణ తీసుకుంటోందట. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉండబోతోందని శంకర్ హింట్ ఇచ్చారు.

2.0 తరువాత శంకర్ భారతీయుడు 2 చిత్ర సీక్వెల్ ని తెరకెక్కించబోతుండడం ఆసక్తిగా మారింది. మరోమారు కమల్ హాసన్ తన నట విశ్వరూపం ప్రదర్శించేందుకు సిద్ధం అవుతున్నాడు. కళ్ళు చెదిరే సెట్స్ లో ఈ చిత్రాన్ని శంకర్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











