Kajal Aggarwal: కాజల్ ఎద అందాల ఎక్స్‌పోజింగ్.. సిగ్గు వదిలేసి మరీ తొలిసారి ఇలా!

తెలుగులో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వెండితెరపై కనిపిస్తున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని టాప్ లేపుతున్నారు. అందులో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన, మైమరపించే ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిన్నది.. సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోంది. ఇక, ఇటీవలే తల్లైనా అస్సలు తగ్గకుండా దూసుకెళ్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ కాజల్ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసం!

కల్యాణంతో వచ్చి.. స్టార్‌గా

కల్యాణంతో వచ్చి.. స్టార్‌గా

ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్న కాజల్ అగర్వాల్ ముందుగా 'లక్ష్మీ కల్యాణం' అనే సినిమాతోనే హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టింది. అందులో అదిరిపోయే నటనతో మెప్పించిన ఈ చిన్నది.. ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ఇలా టాలీవుడ్‌లోని స్టార్లతోనూ ఆడిపాడింది. మొత్తంగా అతి తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది.

ఇండియా వ్యాప్తంగా క్రేజ్

ఇండియా వ్యాప్తంగా క్రేజ్

తెలుగు చిత్రాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత దక్షిణాదిలోని పలు భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో నటించింది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చి కొన్ని చిత్రాల్లో భాగమైంది. ఫలితంగా తన రేంజ్‌ను ఇండియా వ్యాప్తంగా పెంచుకుంది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ.. తన అభిమానులను ఖుషీ చేస్తూ వచ్చింది.

పెళ్లి తర్వాత స్లో.. తల్లైంది

పెళ్లి తర్వాత స్లో.. తల్లైంది

నేషనల్ రేంజ్‌లో సత్తా చాటుతోన్న సమయంలోనే కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌తో రహస్యంగా ప్రేమాయణం సాగించింది. ఇది బయటకు వచ్చిన కొద్ది రోజులకే అతడిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగించిన కాజల్.. గత ఏడాది ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అప్పటి నుంచి సినిమాలకు గ్యాప్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రీఎంట్రీ.. బాలయ్యతోనూ

రీఎంట్రీ.. బాలయ్యతోనూ

తల్లవడం వల్ల చాలా కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ఇటీవలే 'ఘోస్టీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది ఆమెకు సరైన రీఎంట్రీని అందించలేదు. అలాగే, ఇప్పుడు కాజల్ 'ఇండియన్ 2', 'కరుంగాపియమ్', 'ఉమ' అనే సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు, బాలకృష్ణ 108వ చిత్రంలోనూ ఈమె భాగం అయింది.

అందులో మాత్రం రచ్చ

అందులో మాత్రం రచ్చ

చాలా ఏళ్ల పాటు వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్య తల్లి కావడంతో చాలా గ్యాప్ తీసుకున్నా.. కాజల్ అగర్వాల్ మాత్రం సోషల్ మీడియాకు అస్సలు బ్రేక్ ఇవ్వలేదు. పైగా ఇందులో మరింత యాక్టివ్ అయిన ఈ చిన్నది.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతూనే ఉంది.

ఇప్పుడు కూడా తగ్గట్లేదు

ఇప్పుడు కూడా తగ్గట్లేదు

ఎంతో కాలం క్రితమే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాల్లో ఖాతాలను ఓపెన్ చేసింది. వాటిలో అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా బాగానే వదులుతోంది. మరీ ముఖ్యంగా తన సీక్రెట్ అందాలను చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లైనా, తల్లైన తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించకుండా రచ్చ చేస్తోంది.

కాజల్ ఎద అందాల వల

కాజల్ ఎద అందాల వల


తాజాగా కాజల్ అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ భామ మెరిసిపోతోన్న ఓ డిజైనర్ డ్రెస్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా కాజల్ ఫొటోలు అన్నీ వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X