కాజల్ మెహందీ వేడుకలు ఘనంగా.. పెళ్లికి ముందే భర్తతో అలాంటి క్షణాలు..

దక్షిణాది హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లికి ఇంకా కొద్ది గంటలే మిగిలి ఉన్నాయి. ఇక పెళ్లికి ముందు సంప్రదాయబద్దంగా జరుగాల్సిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇంట్లో పెళ్లి పనులు జోరందుకోవడంతో కాజల్ ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతున్నది. కాజల్ ఇంటిలో జరుగుతున్న పెళ్లి జోష్ గురించి మరిన్ని వివరాలు..

బుధవారం రాత్రి మెహందీ ఫంక్షన్

బుధవారం రాత్రి మెహందీ ఫంక్షన్

పెళ్లి ముహుర్తం దగ్గర పడుతుండటంతో కాజల్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. ఇంటిలో సాధారణ యువతి మాదిరిగానే కనిపిస్తూ ఆ క్షణాలను ఆనందిస్తున్నట్టు ఆమె మేకప్ చూస్తే అర్ధమవుతున్నది. ఇలాంటి పరిస్థితుల మధ్య బుధవారం రాత్రి మెహందీ ఫంక్షన్ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె మెహందీ ఫంక్షన్‌ను ఎంజాయ్ చేసినట్టు కనిపించింది.

నీరజ కోన, ఇతర స్నేహితుల కామెంట్

నీరజ కోన, ఇతర స్నేహితుల కామెంట్

మెహందీ ఫంక్షన్ తర్వాత చేతికి గోరింటాకు పెట్టుకొన్న ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. సంతోషం చేతులు కెమెరాకు చూపిస్తూ ఎగిరి గంతేసినంత పని చేసింది. కాజల్ షేర్ చేసిన ఫోటోపై నీరజ కోన, సోదరి నిషా, ఇంకా తన స్నేహితులు స్పందించారు. ఎంత ముద్దుస్తొన్నవో అంటూ నిషా కామెంట్ చేసింది. ఇప్పటికే పలువురు స్నేహితులు కాజల్‌కు ముందస్తుగానే పెళ్లి శుభాకాంక్షలు అందించారు.

పెళ్లి అభరణాలు చూపిస్తూ..

పెళ్లి అభరణాలు చూపిస్తూ..


పెళ్లికి సంబంధించిన అభరణాలను కాజల్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. నా పెళ్లి కోసం డిజైన్ చేయించిన అలంకార నగలు ఇవే అంటూ ఫోటోలు షేర్ చేసింది. ఇదిలా ఉండగా, గురువారం రాత్రి కాజల్ ఇంటిలో హల్దీ ఫంక్షన్ జరుగనున్నది. అలాగే వీలైతే సంగీత్ ఫంక్షన్ కూడా జరగడానికి అవకాశం ఉంది.

గౌతమ్ కిచ్లూతో దసరా పండుగ

గౌతమ్ కిచ్లూతో దసరా పండుగ

ఇదిలా ఉండగా, పెళ్లికి ముందే కాబోయే భర్తతో ఆనందకరమైన క్షణాలను పంచుకొన్నారు. దసరా పండుగను గౌతమ్ కిచ్లూతో కలిసి కాజల్ కుటుంబ సభ్యులు జరుపుకొన్నారు. దసరా పండుగ సందర్భంగా గౌతమ్‌తో కలిసి ఉన్న ఫోటోను కాజల్ షేర్ చేశారు. నీ వల్ల మా ఇంటిలో దసరా పండుగ మరింత శోభను తెచ్చింది అంటూ కాజల్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Recommended Video

Kajal Aggarwal Fiance Gautam Kitchlu's Full Details
అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూతో పెళ్లి

అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూతో పెళ్లి

కోవిడ్ 19 పరిస్థితుల కారణంగా కాజల్ వివాహం అతి నిరాడంబరంగా జరుగనున్నది. కొద్ది రోజుల క్రితం నా వివాహం అక్టోబర్ 30న ముంబైలోని వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో జరుగనున్నది అని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం.. కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులే ఈ పెళ్లికి ఆహ్వానించినట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X