Don't Miss!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘సాహో’ ఆఫర్ తిరస్కరించిన కాజల్.. ఈమె చేసిన పనికి చిత్ర యూనిట్ షాక్
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో వస్తున్న చిత్రం 'సాహో'. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాతో మరో ప్రయత్నం చేయబోతున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక, నాలుగు భాషల్లో విడుదల కావడానికి తోడు భారీ బడ్జెట్‌తో వస్తున్న చిత్రం అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న సాహో విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇప్పటికే ప్రభాస్ - శ్రద్ధాకపూర్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. దీనికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. దీని తర్వాత పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది సాహో యూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది.
సాహోలోని 'బ్యాడ్ బాయ్' అంటూ సాగే ఈ పాటను కొద్దిరోజుల క్రితం విడుదల చేశారు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో ప్రభాస్ చిందులేశాడు. వాస్తవానికి ఈ సినిమాలో జాక్వెలిన్ స్పెషల్ సాంగ్ చేస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. కానీ, దీనిపై ఎవరూ స్పందించలేదు. అలాంటిది సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక్కసారిగా దీన్ని విడుదల చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
అయితే, అంతకంటే ముందే ఈ సాంగ్ కోసం కాజల్ అగర్వాల్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. దీనికి ఓకే చెప్పేసిన ఈ స్టార్ హీరోయిన్.. అందుకు గానూ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అడిగిందట. దీనికి చిత్ర యూనిట్ షాక్ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతనే జాక్వెలిన్‌ను సంప్రదించారనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఇప్పుడు సాహో ఫీవర్ చూసిన తర్వాత.. ఈ బిగ్ ప్రాజెక్టులో కాజల్ కచ్చితంగా ఛాన్స్ మిస్ చేసుకుందని బాధ పడుతుందన్న విషయంలో సందేహం లేదు.