బోల్డ్ సీన్స్.. బూతులు ఉండడం వల్లే కాజల్‌కు షాకిచ్చారు.. మరీ ఇంత దారుణమా.!
ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది టాలీవుడ్ చందమామ కాజల్. ఇప్పుడు మాత్రం దానికి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు హిట్‌లు లేక మరోవైపు అవకాశాలు రాక ఇబ్బంది పడుతోంది. ఉన్న సినిమాలేమో వివాదాస్పదం అవుతుండడం.. ఎంపికైన సినిమా నుంచి తప్పుకోవడం వంటి వాటితో కాజల్ ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే ఎన్నో సమస్యలు ఆమెను చుట్టుమట్టగా.. తాజాగా కాజల్ నటించిన చిత్రానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

క్వీన్ రీమేక్
బాలీవుడ్‌లో కంగనా నటించిన ‘క్వీన్' ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ సినిమాను అన్ని భాషల్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే ఈ సినిమా తెలుగులో తమన్నా హీరోయిన్‌గా ‘దటీజ్ మహాలక్ష్మి' పేరుతో తెరకెక్కింది. కన్నడంలో పరూల్‌మాధవ్ హీరోయిన్‌గా ‘బటర్‌ఫ్లై' పేరుతోనూ, మలయాళంలో మంజిమామోహన్ హీరోయిన్‌గా ‘జామ్‌జామ్' పేరుతో, తమిళంలో కాజల్ మెయిన్ లీడ్‌గా ‘ప్యారిస్ ప్యారిస్' టైటిల్‌తో తెరకెక్కింది.

అన్ని భాషల్లో ఓకే కానీ..
ఈ సినిమా దక్షిణాదిలోని నాలుగు భాషల్లో రూపొందింది. మీడియంట్ ఫిలిం పతాకంపై మనుకుమార్ వీటిని నిర్మించారు. త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో తెలుగు, కన్నడం, మలయాళం వెర్షన్లకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్లను ఇచ్చారు. కానీ, తమిళ వెర్షన్‌కు మాత్రం ‘ఏ' సర్టిఫికెట్ జారీ చేశారు.

రివైజింగ్ కమిటీకి వెళ్లాలని..
కాజల్ చిత్రానికి ‘ఏ' సర్టిఫికెట్ అవ్వడంతో పాటు 25 వరకూ ఆడియో, వీడియో కట్స్‌ను ఇచ్చారు. దీంతో చిత్ర యూనిట్ రివైజింగ్ కమిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీడియాకు వెల్లడించారు. కమిటీ ఈ సినిమాను చూసిన తర్వాత ఏలాంటి నిర్ణయం ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఆ సీన్లు ఉండడం వల్లేనా?
‘ప్యారిస్ ఫ్యారిస్'లో బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయని టీజర్ చూస్తేనే అందరికీ అర్థం అయింది. అంతేకాదు, టీజర్‌లో కాజల్ బ్రెస్ట్‌ని మరో నటి ప్రెస్ చేయడం అప్పట్లో సంచలనమైంది. ఇందులో అలాంటి సీన్స్ ఇంకా ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు కట్స్ రావడంతో ఇది నిజమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కాజల్‌కే అలాంటి సీన్స్ ఎందుకు..?
మిగిలిన అన్ని భాషల్లో మామూలుగా తెరకెక్కించినా.. కాజల్ నటిస్తున్న సినిమాలోనే ఎందుకు అలాంటి సీన్స్ పెట్టారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనుక ఎవరి ప్రోద్బలం ఉందని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఈ సినిమా విడుదల అవుతుందా..? లేక ఆగిపోతుందా..? అన్నది చెప్పడం కష్టంగా మారింది.


Click it and Unblock the Notifications











