యంగ్ బ్యూటీలకు కాజల్ అగర్వాల్ ఛాలెంజ్.. లేట్ వయస్సులోనూ ఇలా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులను ఎంతలా అలరించిందో తెలిసిందే. దాదాపు 20 ఏళ్ల పాటు చలన చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తోంది. 'లక్ష్మి కళ్యాణం', 'చందమామ' వంటి చిత్రాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రాలతోనే ఆడియెన్స్ నుంచి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది.

కాజల్ అగర్వాల్ ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ టాలీవుడ్ చిత్రాలతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. మహారాష్ట్రలోని బాంబే పట్టణంలో ఈ బ్యూటీ 1985 జూన్ 19న జన్మించింది. వాళ్ల తండ్రి విజయ్ అగర్వాల్ బిజినెస్ మ్యాన్ కావడం విశేషం. ఇక కాజల్ అగర్వాల్ కు తన పొలికలతోనే ఉన్న చెల్లి నిషా అగర్వాల్ కూడా ఉన్నదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె కూడా తెలుగులో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

Kajal Aggarwal oozes glamour in Trendy Wea

ఇదిలా ఉంటే.. కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లోనే కాదు సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఆమె నటనకు దక్షిణాది ఆడియెన్స్ ఎంతో ఫిదా అయ్యారు. టాలీవుడ్ లోని స్టార్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ, రానా దగ్గుబాటి... మెగా స్టార్ చిరంజీవితోనూ కూడా నటించే ఛాన్స్ దక్కించుకుంది. బడా హీరోలకు ధీటుగా నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది.

అయితే, కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో ఓవైపు ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. తన ఫ్యాన్స్ కు ఎప్పుడూ టచ్ లోనే ఉంటూ తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే స్టన్నింగ్ లుక్ లో మెరుస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. లేట్ వయస్సుల్లోనూ ఈ హీరోయిన్ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. కాగా తాజాగా తన లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

కాజల్ అగర్వాల్ తన లేటెస్ట్ ఫొటోషూట్ తో ఆకట్టుకుంటోంది. బాడీ టైట్ ఫిట్ డ్రెస్ లో గ్లామర్ ను వెదజల్లింది. యంగ్ లుక్ తో స్లిమ్ ఫిట్ అందంతో మైమరిపించింది. అయితే కాజల్ అగర్వాల్ నాలుగు పదుల వయస్సులోనూ ఇంత బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తుండటంతో అభిమానులు పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక తన లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.

Kajal Aggarwal oozes glamour in Trendy Wea

అయితే, కాజల్ అగర్వాల్ 2020లోనే తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొడుకు నీల్ కిచ్లుకు జన్మనిచ్చి తల్లిగా ప్రమోషన్ పొందింది. కాగా, తన పెళ్లి, ప్రెగ్నెసి తర్వాత కాజల్ రూపసౌందర్యం కాస్తా మారిపోయింది. దీంతో కాజల్ మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం తన లేటెస్ట్ ఫొటోషూట్ తో వింటేజ్ లుక్ లో మెరియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆమె గ్లామర్ మెరుపులకు ఫిదా అవుతున్నారు. ఇక కాజల్ అగర్వాల్ చివరిగా 'ఇండియన్ 2' చిత్రంతో అలరించింది. ప్రస్తుతం 'సికందర్', మంచు విష్ణు 'కన్నప్ప' చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ఇండియన్ 3, ది ఇండియా స్టోరీ వంటి చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X