కాజల్ అగర్వాల్ బయటకు వచ్చేసిందట.. షాకిస్తున్న బ్యూటీ నిర్ణయం!

దక్షిణాదిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఇండియన్ 2. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ కమల్ హాసన్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారనే విషయం మీడియాలో అప్పట్లో చర్చనీయాంశమైంది. భారీ ప్రాజెక్టులో కమల్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేయడం మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఆలస్యం కావడంతో కాజల్ తప్పుకొన్నారనే వార్త మరోసారి మీడియాలో గుప్పుమన్నది. వివరాల్లోకి వెళితే..

ఇండియన్ 2 సినిమా సెట్స్‌పైకి..

ఇండియన్ 2 సినిమా సెట్స్‌పైకి..

రోబో 2.0 తర్వాత లైకా ప్రొడక్షన్ ఇండియన్ 2 సినిమాను చెన్నైలో భారీగా ప్రారంభించింది. దాంతో జనవరిలో సెట్స్‌పైకి వెళ్తుందని ఆశించారు. కానీ బడ్జెట్ విషయంలో శంకర్, లైకా ప్రొడక్షన్‌కు మధ్య విభేదాలు తలెత్తడంతో సెట్స్ పైకి వెళ్లకుండా ఆగిపోయింది. లైకా నుంచి ఈ ప్రాజెక్ట్ రిలయన్స్‌కు వెళ్లిందనే వార్త కూడా మీడియాలో ప్రచారం జరిగింది.

ఇండియన్ 2 ఆగిపోలేదని

ఇండియన్ 2 ఆగిపోలేదని

అయితే ఇటీవల ఇండియన్ 2 సినిమా గురించి రూమర్లు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ విషయం గురించి తెలుగు ఫిలింబీట్ ప్రస్తావించగా.. కాజల్ స్పందిస్తూ.. సినిమా ఆగిపోలేదు. జూన్ 1 తేదీ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించడానికి యూనిట్ కసరత్తు చేస్తున్నది. అలాంటి ప్రాజెక్టులో భాగస్వామ్యమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కమల్ సార్‌తో నటించడం ఇంకా ఆనందంగా ఉంది అని కాజల్ వివరణ ఇచ్చింది.

తప్పుకొన్న కాజల్ అగర్వాల్

తప్పుకొన్న కాజల్ అగర్వాల్

అయితే జూన్ 1 తేదీ నుంచి ఇండియన్ 2 ప్రారంభం కాకపోవడంతో కాజల్ అసహానానికి గురైందట. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం జరిగిందట. ఇండియన్ 2 నుంచి కాజల్ బయటకు వచ్చేసిందనే వార్త తమిళ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ అంశంపై పెద్దగా క్లారిటీ లేదు. అటు కాజల్ గానీ, లైకా గానీ సోషల్ మీడియాలో వెల్లడించకపోవడంతో అనేక ఊహాగానాలు చలరేగుతున్నాయి.

మరో హీరోయిన్‌ కోసం వేట

మరో హీరోయిన్‌ కోసం వేట

ఇండియన్ 2 సినిమా నుంచి కాజల్ అగర్వాల్ తప్పుకొన్నాదా అనే అంశంపై లైకా స్పందిస్తుందా? లేక కాజల్‌కు బదులు మరో హీరోయిన్‌ను పెట్టుకొంటారా? అనే విషయంపై తమిళ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సినిమా నుంచి కాజోల్ తప్పుకున్నట్టు ఏదైనా అధికారికంగా ప్రకటన వస్తుందో వేచి చూడాల్సిందే.

కాజల్ పరిస్థితి అగమ్య గోచరంగా

కాజల్ పరిస్థితి అగమ్య గోచరంగా

ఇక కాజల్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె తాజాగా నటించిన తెలుగు చిత్రం సీత బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక క్వీన్ రీమేక్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. సీత తర్వాత ఎలాంటి సినిమాలు చేస్తుందో అనే విషయంపై ఇంకా క్లారిటీ కూడా లేకపోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X