For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kajal Aggarwal: తల్లైన తరువాత సరికొత్తగా కాజల్ రీ ఎంట్రీ.. మళ్ళీ అదే రేంజ్ లో..

  |

  తెలుగు చిత్ర పరిశ్రమలో గత 20 ఏళ్లుగా ఎంతో మంది హీరోయిన్స్ వస్తున్నారు వెళుతున్నారు. ఇక వారిలో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న టాప్ హీరోయిన్ లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఆమె సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో తన స్టార్ ఇమేజ్ ను కాపాడుకుంటూ వచ్చింది. అందంతోనే ఎంతగానో ఆకట్టుకునే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోవడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఎక్కువగానే ఇవ్వాల్సి వచ్చింది.

  ఇక తల్లి అయిన తర్వాత ఆమె సినిమాలకు దాదాపు దూరమైనట్లు అని కూడా టాక్ వచ్చింది. అయితే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  వరుస విజయాలు

  వరుస విజయాలు

  గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అయితే చందమామ సినిమాతో ఒక్కసారిగా తన స్థాయిని పెంచుకున్న విషయం తెలిసిందే. మొదట లక్ష్మీ కళ్యాణం తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత సినిమాలు వరుసగా విజయం సాధించడంతో స్టార్స్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో అయితే ఈ బ్యూటీని ముద్దుగా చందమామ అని పిలుచుకుంటారు కూడా.

  ఆ ప్రభావం పడకుండా..

  ఆ ప్రభావం పడకుండా..

  కాజల్ అగర్వాల్ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి దాదాపు 18 ఏళ్ళు కావస్తోంది. ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఈ బ్యూటీ ఎన్నో అవకాశాలను అందుకుంది. ఒక విధంగా మిగతా హీరోయిన్స్ కి ఒక ఫ్లాప్ వస్తే వెంటనే తదుపరి సినిమా పై ప్రభావం చూపిస్తుంది. మెల్లగా అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటాయి. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం అలాంటి ప్రభావం తన సినిమాలపై చూపించకుండా అన్ని వర్గాల హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చింది.

  ఫ్యామిలీ లైఫ్

  ఫ్యామిలీ లైఫ్

  ఇక కాజల్ అగర్వాల్ గత రెండేళ్ల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతనితో కూడా 7 ఏళ్లకుపైగా ప్రేమ లో ఉన్న కాజల్ కరోనా సమయం లోనే అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఇక ఆమె ఇటీవల ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఫ్యామిలీ లైఫ్ తో చాలా బిజీగా ఉన్నట్లు కూడా అనిపిస్తోంది.

  మళ్ళీ ఎప్పటిలానే..

  మళ్ళీ ఎప్పటిలానే..

  అయితే పెళ్లి తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు తల్లి అయిన తర్వాత నటిస్తుందా లేదా అనే విషయం అందరిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఒక విధంగా అయితే గతంలో తన సినిమాలకు అంత ఈజీగా ముగింపు పలకనని పెళ్లి తర్వాత కూడా వెండితెరపై కనిపిస్తానని చెప్పింది. ఇక ఇప్పుడు తల్లి అయిన తర్వాత కూడా ఆమె అదే తరహాలో ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

  అవకాశాల కోసం సెర్చ్..

  అవకాశాల కోసం సెర్చ్..

  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ మేనేజర్స్ అందరూ కూడా తెలుగు తమిళ ఇండస్ట్రీలో కొంత మంది దర్శక నిర్మాతలతో కలిసి చర్చలు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ కు సరిపోయే పాత్రలు ఒక్కటి కనెక్ట్ అయినా కూడా ఆమెతోనే చేయించాలనే సెర్చ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

  కాజల్ కూడా ఈ సెకండ్ ఇన్నింగ్స్ ను ఎలా ముందుకు సాగిస్తుంది అనేది కొంత హాట్ టాపిక్ గా మారింది. కాజల్ మనసులో మాత్రం ఎప్పటిలానే హీరోయిన్ గా చేయాలని అనుకుంటోందట. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.

  English summary
  Kajal Aggarwal planing on silver screen entry with same ideas
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X