బాత్రూమ్ లో కాజల్ పిచ్చెక్కించే ఫోజులు... చందమామ అందం చూస్తే మతి చెడాల్సిందే
అందాల చందమామ కాజల్ అగర్వాల్ మరికొన్ని గంటల్లోనే సత్యభామ అనే మూవీతో థియేటర్లలో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాజల్ ఏకంగా బాత్రూంలో ఫోటోషూట్ చేసి, ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో వదిలింది. ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం కాజల్ అందమైన లేటెస్ట్ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.తాజా ఫోటోషూట్ లో కాజల్ అగర్వాల్ బ్లాక్ కలర్ డ్రెస్ లో దర్శనం ఇచ్చింది. ఫుల్ స్లీవ్స్ ఉన్న జాకెట్, లాంగ్ స్కర్ట్ వేసుకుని, మినిమల్ మేకప్ తో స్టోన్స్ ఉన్న ఇయర్ డ్రాప్స్ పెట్టుకొని తన అందంతో ఆకట్టుకుంటుంది.
కాగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామ జూన్ 7న థియేటర్లలోకి రాబోతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించింది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ క్రైం థ్రిల్లర్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

అయితే నిజానికి కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఉండాల్సింది. భారతీయుడు 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని భావించింది కాజల్ అగర్వాల్. కానీ ఈ మూవీ జూలై కి పోస్ట్ పోన్ అవ్వడంతో ఆమె నటించిన మరో మూవీ సత్యభామ రిలీజ్ కి రెడీ అయ్యింది.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో కాజల్ అగర్వాల్ బిజీగా ఉంది. హైదరాబాద్ లో మహిళా ప్రేక్షకులకు సత్యభామ టీం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలకు ఉచిత టిక్కెట్లు ఇవ్వబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు.
కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. మహిళలు షి సేఫ్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే సత్యభామ టికెట్లు ఉచితంగా ఇచ్చేలా ప్లాన్ చేశారు. సొసైటీ ఆఫ్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రారంభించిన డిజిటల్ ప్లాట్ఫామ్ షీ సేఫ్ యాప్ ను ఇన్స్టాల్ చేసినట్టుగా చూపిస్తేనే టికెట్లను ఇస్తారు.
హైదరాబాదులో ఒక్క బటన్ నొక్కితే చాలు మహిళలు సేఫ్ గా ఉండేలా ఈ యాప్ ను రూపొందించారు. ఇక మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సత్యభామ రిలీజ్ హడావిడి నడుస్తుండగా, మరోవైపు కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు పోస్ట్ చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది.


Click it and Unblock the Notifications











