ఆచార్యలో తన క్యారెక్టర్ తీసెయ్యడంతో.. కాజల్ షాకింగ్ రియాక్షన్.. నవ్వుతూనే సమాధానం..
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరి ఫోకస్ ఆచార్య సినిమా పైనే ఉంది. RRR సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి తో చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా కావడంతో అభిమానుల్లో అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా కాజల్ పాత్ర సినిమాలో నుంచి తీసేసినట్లుగా దర్శకుడు కొరటాల శివ ఓపెన్ గానే చెప్పేసాడు. ఇక కాజల్ అగర్వాల్ కూడా వెంటనే యాక్షన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

సెకండ్ హాఫ్ లోనే..
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ మొట్టమొదటిసారి కలిసి నటించిన ఫుల్ యాక్షన్ డ్రామా ఆచార్య సినిమా ఈ నెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ మొదటి అతిథి పాత్రలో తీసుకోవాలని అనుకున్న కొరటాల ఆ తరువాత 40 నిమిషాల నిడివి ఉన్న పాత్రను డిజైన్ చేయాల్సి వచ్చింది. రామ్ చరణ్ పాత్ర సెకండాఫ్ లోనే ఉంటుందట.

కాజల్ గురించి..
ఇక రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే. ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక మెగాస్టార్ చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె గురించి ఈవెంట్ లో ఎవరు కూడా ఒక్క మాట మాట్లాడకపోవడం కూడా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఆ కారణంగా కాజల్ అవుట్
అసలు ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ ఉందా లేదా అనే అనుమానాలు ఎన్నో వస్తున్న తరుణంలో దర్శకుడు కొరటాల శివ ఓపెన్ గానే ఆ విషయంపై క్లారిటీ ఇవ్వడం విశేషం. కాజల్ అగర్వాల్ పాత్రను మొదట మంచి కామెడీ రొమాంటిక్ గా ఉండే విధంగా గా డిజైన్ చేసుకుని ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆచార్య పాత్ర అలాంటి ఫీలింగ్స్ ను ఎన్నడు కోరుకోదు కాబట్టి కనీసం ఆమెతో సాంగ్ కూడా లేదు కాబట్టి వెంటనే ఆ పాత్రను తీసేసినట్టు చెప్పారు. మొత్తానికి కాజల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లనే తీసేసినట్లు టాక్.

అందరితో మాట్లాడి..
కాజల్ అగర్వాల్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు మిగిలివుండగానే దర్శకుడు కొరటాల శివ ఈ ప్రాజెక్టు నుంచి ఆమెను తప్పించినట్లు గా తెలుస్తోంది. అయితే ముందుగా మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ తేజ్ చిత్ర యూనిట్ సభ్యులకు కూడా కాజల్ అగర్వాల్ పాత్ర పై చర్చలు జరపడం జరిగింది. ఇక వారందరూ కూడా ఒకే తరహా నిర్ణయం తీసుకోవడంతో ఆమెను తప్పించక తప్పలేదట.

కాజల్ రియాక్షన్
ఇక కాజల్ కు ఆచార్య ప్రాజెక్టు నుంచి తప్పిస్తున్నట్లు దర్శకుడు కొరటాల శివ చెప్పగానే ఆమె వెంటనే రియాక్షన్ ఇచ్చిందట. కాజల్ ఆ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా చిరునవ్వుతోనే ఆ నిర్ణయాన్ని అంగీకరించినట్లు చెప్పిందట. షూటింగ్ లో నేను మీ అందరిని మిస్ అవుతాను అంటూ భవిష్యత్తులో మాత్రం తప్పకుండా మీతో కలిసి పని చేయాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పినట్లుగా కొరటాల శివ కూడా వెంటనే వివరణ ఇచ్చాడు.

పాటలో ఉందా లేదా?
దాదాపు ఆచార్య సినిమాలో కాజల్ పాత్రను మొత్తంగా తీసినట్లు కొరటాల శివ ఒక క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇంతకు ముందు లాహే లాహే అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయగా అందులో సంగీత తో పాటు కాజల్ అగర్వాల్ కూడా కనిపించింది. అయితే పాటలో అయినా కాజల్ కనిపిస్తుందా లేదా అనే ప్రశ్న అడుగగా.. అది సినిమా చూసి మీరే తెలుసుకోవాలి అని కొరటాల తెలియజేశారు.


Click it and Unblock the Notifications











