twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kajal Aggarwal ప్రెగ్నెన్సీ తర్వాత గ్రాండ్ రీ ఎంట్రీ.. ఏ హీరోతో ఎప్పుడు షూటింగ్ అంటే?

    |

    దక్షిణాదిలో అగ్రతార కాజల్ అగర్వాల్ రీఎంట్రీకి సిద్దమవుతున్నారు. పెళ్లి, ఆ తర్వాత పెగ్నెన్సీ కారణంగా ఆమె షూటింగులకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. డెలివరీ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతూ తన బాడీని కరెక్ట్ చేసుకొంటున్నారు. వర్కవుట్స్‌తో మళ్లీ అందాల పూర్వవైభవాన్ని ప్రేక్షకుల పంచేందుకు సిద్దంగా ఉన్నారు.

    ప్రెగ్నెన్సీకి ముందు కాజల్ నటించిన ఆచార్య సినిమా ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ సినిమాలోని తన పార్ట్‌ను పూర్తిగా తొలగించడంతో నిరాశకు లోనయ్యారు. అయితే ఊహించని విధంగా ఆచార్య సినిమా కూడా ఫ్లాప్ కావడంతో తాను లేననే ఫీలింగ్ కాస్త ఉపశమనం ఆమెకు కలిగించింది.

    అయితే ఇటీవల ఇన్స్‌టాగ్రామ్‌లో లైవ్ చాటింగ్ చేస్తూ తన కెరీర్ ప్లాన్స్, రీఎంట్రీ గురించి వివరాలు అందించింది. తనను ఇండియన్ 2 సినిమా నుంచి తప్పించినట్టు వస్తున్న వార్తలను కాజల్ ఖండించింది. తాను ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు.

    Kajal Aggarwal re entry with Kamal Haasans Indian 2 movie in September

    ఇండియన్ 2 సినిమా షూటింగ్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం అవుతుంది. తాను ఆ షెడ్యూల్‌లో పాల్గొంటానని క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాలో నటిస్తూ చనిపోయిన వివేక్, మలయాళం నటుడు నెడుముడి వేణు స్థానంలో వేరే నటులను తీసుకొంటున్నారు అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

    ఇండియన్ 2 విషయానికి వస్తే... ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీ బ్యానర్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో కమల్ హాసన్‌తోపాటు కాజల్ నటిస్తున్నది. ఈ చిత్రం 1996 వచ్చిన ఇండియన్ (భారతీయుడు) సినిమాకు సీక్వెల్. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని నటిస్తున్నారు

    English summary
    Kajal Aggarwal start her career with Kamal Haasan's Indian 2 movie in September. She has given clarity on instagram live that, She has been part of the Indian 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X