దానికి భయపడే ప్రసక్తే లేదు.. కావాలనే ఇలా చేస్తున్నా: కాజల్ అగర్వాల్
సౌత్ ఇండియన్ తెరపై సూపర్ క్రేజ్ సంపాదించింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. సౌత్ లోని అన్ని భాషా చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగి అందరు అగ్ర హీరోల సరసన నటించింది. పాత్ర ఎలాంటిదైనా దానికి పూర్తిగా న్యాయం చేయడంలో కాజల్ సఫలమైంది. అందుకే దశాబ్ద కాలానికి పైగా వెండితెర హవా కొనసాగిస్తూ 50కి పైగా సినిమాలు చేసింది.
అయితే ఈ మధ్యకాలంలో మాత్రం కాజల్ హవా అంతగా కనిపించడం లేదు. కొంతమేర సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇక కాజల్ కెరీర్ ఫినిష్ అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన కాజల్ అగర్వాల్ ఆ వార్తలపై స్పందిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

''ప్రస్తుతం నేను నటిగా చాలా పరిణితి చెందాను. సినిమాల పరంగా రిస్క్ తీసుకోవడానికి భయపడను. ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. నాకు పాత్ర నచ్చలే గానీ కొత్తవాళ్లతో జత కట్టడానికి కూడా రెడీ. ఇప్పటివరకు నేను రెస్ట్ లేకుండా సినిమాలు చేశాను. కాబట్టి ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. అందుకే సినిమాలు అంగీకరించడం లేదు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ సినిమాలు చేస్తా'' అని కాజల్ చెప్పింది.
ఇకపోతే ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు 2లో కాజల్ నటిస్తోంది. ఈ సినిమాలో 85 ఏళ్ల ముసలమ్మ పాత్రలో ఆమె నటిస్తుండటం విశేషం. దీంతో పాటు బాలీవుడ్‌లో 'ముంబాయి సాగా' సినిమా చేస్తోంది.


Click it and Unblock the Notifications











