ముగ్గురు మెగా హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తమ నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. అలాగే .. తమ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను క్రియేట్ చేశారు. అలాంటి మెగా హీరోస్ రొమాన్స్ చేసిన ఏకైక తెలుగు హీరోయిన్ గా ఓ బ్యూటీ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఆ పైగా మెగా హీరోస్ ఆమె నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ లో సునామీ స్రుష్టించాయి. ఇంతకీ హీరోయిన్ ఎవరో తెలుసా?
మెగా హీరోస్ అనగానే గుర్తుకు వచ్చేంది. మెగాస్టార్ చిరంజీవి.. ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆయన తన నటప్రస్తానంలో బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేసుకున్నారు.వందల కోట్లు కొల్లగొట్టారు. అందుకు మించి.. కోట్లాది మంది అభిమానాన్ని గెలుచుకున్నారు. నిజంగా మెగాస్టార్ సినిమా విడుదలంటే థియేటర్‌ల దగ్గర సందడి ప్రారంభమవుతోంది. చిరంజీవీ స్క్రీన్‌పై చూసి.. చొక్కాలు చింపుకుని పునకాలతో ఊగిపోయే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. ఆయనను స్పూర్తిగా తీసుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కళాకారులెందరో ఉన్నారు.

మెగా హీరోస్ లో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి సోదరుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాన్స్ అందు పవర్ స్టార్ ఫ్యాన్స్ వేరయా అనే లెవల్లో వారి అభిమానం ఉంటుంది. ఇక సినిమాల్లో పవర్ స్టార్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అటు రాజకీయాల్లో .. ఇటు సినిమాల్లో బిజీగా మారారు పవన్ కళ్యాణ్.
తర్వాత చిరంజీవి తనయుడు రామ్ చరణ్ .. చిరుత మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మగధీర, ఆర్ ఆర్ఆర్ వంటి భారీ హిట్స్ అందుకుని గ్లోబల్ స్టార్ గా మారారు. తాజాగా గేమ్ ఛేంజర్ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ అంటే రికార్డుల పరంపర . ఈ మెగా హీరోతో నటించాలనీ, వారి సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించాలని భావిస్తుంటారు ప్రతి నటుడు. అలాంటి మెగా హీరోతో హీరోయిన్ గా నటించి..అరుదైన ఘనత సొంతం చేసుకుంది ఓ టాలీవుడ్ హీరోయిన్.

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈ అమ్మడు ఒక్క చిరంజీవితోనేకాదు పవన్ కల్యాణ్, రామ్ చరణ్ తో కూడా కలిసి నటించి, మెప్పించింది. చిరంజీవి కంబ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించింది. ఇక పవన్ కల్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నటించగా.. రామ్ చరణ్ తో మూడు సినిమాలు చేసింది. మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే తో రొమాన్స్ చేసింది. ఇందులో మగధీర ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, నాయక్ సూపర్ హిట్, గోవిందుడు అందరివాడేలే సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇలా మెగా కుటుంబంలో ముగ్గురు హీరోలతో కాజల్ అగర్వాల్ రొమాన్స్ చేసి అరుదైన రికార్డును నెలకొల్పింది.


Click it and Unblock the Notifications











