నిర్మాతల నుంచి ఒత్తిడి.. ఆ విషయంలో వెనకడుగు వేసిన కాజల్
టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ మూడు పదుల వయసు దాటినా ఇంకా అదే అందంతో జనాలను ఆకర్షిస్తోంది. అయితే ఇటీవల ఈ బ్యూటీపై ఎవరు ఊహించని విధంగా రూమర్స్ వస్తున్నాయి. రెమ్యునరేషన్ విషయంలో చందమామ కొంచెం గట్టిగా ఉండడంతో నిర్మాతల నుంచి ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.
కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇక రానున్న రోజుల్లో నిర్మాతలు సినిమా బడ్జెట్ ని కూడా తగ్గించనున్నారు. అందుకే సినీ తారలు కూడా ఎంతో కొంత నిర్మాతలపై అధిక భారం పడకుండా ఫీజులు తగ్గించుకోవాలని అభ్యర్ధనలు వస్తుండడంతో చాలా మంది కోలీవుడ్ తారలు మద్దతు పలికారు.

ఇక కాజల్ ని కూడా తగ్గించాలని కొందరు నిర్మాతలు కోరగా ఆమె మొదట ఒప్పుకోలేదట. అందుకే తేజ అలివేలు వెంకటరమణ సినిమా నుంచి కూడా ఆమెను తప్పించినట్లు టాక్ వచ్చింది. ఇక ఇదే తరహాలో కోలీవుడ్ లో ఉన్న అవకాశాలు కూడా తగ్గుతాయని అమ్మడు కొంత వరకు తగ్గించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్ లో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో కూడా ఒక బిగ్ బడ్జెట్ సినిమాలో నటిస్తోంది. ఇక తెలుగులో మెగాస్టార్ ఆచార్య సినిమాలో కీలక పాత్రలో కనిపించనుందని టాక్ వస్తున్నప్పటికీ ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు.


Click it and Unblock the Notifications











