కాజల్ అగర్వాల్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?.. ఆ క్రికెటర్ అంటే అలాంటి పిచ్చి అంటున్న సత్యభామ

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ ఫస్ట్ క్రష్ గురించిన ఓ వార్త వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఫస్ట్ క్రష్ ఎవరు అనే విషయంపై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.

లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్ గా పరిచయమైన కాజల్ అగర్వాల్ చందమామ మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ మగధీర మూవీ ఆమె కెరీర్ ను మార్చేసింది.

Kajal Aggarwal reveals her first Crush and Favorite Cricketer in India

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా రికార్డులను బ్రేక్ చేయడంతో అందులో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు ఆమె ఇంటి తలుపు తట్టాయి.

కాజల్ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్స్ తో జత కట్టి సౌత్ లో దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది.

ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హ్యాపీగా బిజినెస్ మాన్, తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే సినిమాల వేగం పెంచుతోంది.

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ పాత్రలకు కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తోంది. అలాగని అందాల ఆరబోతకు మాత్రం దూరంగా లేదు. సోషల్ మీడియాలో ఒక బిడ్డకు తల్లయ్యాక కూడా కాజల్ ఓ రేంజ్ లో గ్లామర్ వలకబోస్తూ హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.

Kajal Aggarwal reveals her first Crush and Favorite Cricketer in India

ఈ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ కు సంబంధించిన ఓల్డ్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో కాజల్ తన ఫస్ట్ లవ్ గురించి వెల్లడించింది. నెట్టీంట సందడి చేస్తున్న ఆ వీడియోలో కాజల్ తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పుకొచ్చింది. అతని పేరు అక్షయ్ అని, కాలేజ్ రోజుల్లో జరిగిన తన వన్ సైడ్ లవ్ స్టోరీని రివీల్ చేసింది. అలాగే తనకు క్రికెట్ అంటే ఇష్టమని, రోహిత్ శర్మకు వీరాభిమానిని అని కాజల్ క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ ఏకంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంది. అలాగే సత్యభామ అనే చిత్రంలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ గురించే కాజల్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X