గౌతమ్‌తో ఏడేళ్లుగా రిలేషన్. మూడేళ్లుగా డేటింగ్. రొమాన్స్ విషయంలో... సీక్రెట్ లవ్ గురించి కాజల్
దక్షిణాదిలో అగ్రతార కాజల్ అగర్వాల్ నిరాడంబరంగా వివాహం చేసుకొని దాంపత్య జీవితంలోకి ప్రవేశించింది. సుదీర్ఘకాలంగా ప్రేమిస్తున్న గౌతమ్‌తో కాజల్ వివాహం అక్టోబర్ 30వ తేదీన ముంబైలోని హెటల్ తాజ్ కొలాబాలో జరిగిన విషయం తెలిసిందే. గౌతమ్‌తో ఉన్న రిలేషన్‌ను ఎన్నడూ బయటపెట్టని కాజల్ పెళ్లి తర్వాత తన ప్రేమ కథను వెల్లడిస్తూ..

ఏడేళ్లుగా రిలేషన్.. మూడేళ్లుగా డేటింగ్
ముంబైకి చెందిన పత్రిక వోగ్‌తో కాజల్ మాట్లాడుతూ.. గౌతమ్‌తో నా స్నేహబంధం ఏడేళ్లుగా కొనసాగుతున్నది. మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాం. గత ఏడేళ్లుగా వేసిన ప్రతీ అడుగు మా జీవితాలకు గట్టి పునాధి వేసింది. మేము తీసుకొన్న ప్రతీ నిర్ణయం మా జీవితానికి కీలకంగా మారింది అంటూ కాజల్ అగర్వాల్ తెలిపారు.

బిజీగా ఉన్నా.. ఎప్పుడూ కలిసే వాళ్లం
నేను షూటింగులతో బిజీగా ఉన్నా.. లేకున్నా ఏదో విధంగా టచ్‌లో ఉండేవాళ్లం. వీకెండ్ పార్టీలతోగానీ, లేదా స్నేహితులతో మీటింగ్‌తో గానీ మేము కలుస్తూనే ఉండేవాళ్లం. గౌతమ్ నాపై చూపించే ప్రేమ, అభిమానం గురించి మాటల్లో చెప్పలేను. మా ఏడేళ్ల అనుబంధంలో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి.

లాక్‌డౌన్‌లో మాస్కులు ధరించి
ఇక లాక్‌డౌన్‌లో పెళ్లికి బీజం పడింది. ముంబైలో కరోనావైరస్ కారణంగా నిబంధనలు, ఆంక్షలు కొనసాగుతుండటంతో కొన్ని వారాలపాటు కలుసుకోలేకపోయాం. ఆ తర్వాత మాస్కులు ధరించి సూపర్ మార్కెట్‌లో కలుసుకొనే వాళ్లం. ఆ సమయంలోనే ఒకరిని ఒకరు విడిచి ఉండలేమనే విషయం అర్ధమైంది. దాంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాం అని కాజల్ తెలిపింది.
Recommended Video

పెళ్లి విషయంలో డ్రామా లేదు
గౌతమ్‌తో పెళ్లి ప్రతిపాదన ఎలా సాగిందనే ప్రశ్నకు.. మా మ్యారేజ్ ప్రపోజల్‌లో డ్రామా లేదు. మోకాళ్ల మీద ఉండి లవ్ కోసం గానీ, మ్యారేజ్ కోసం గానీ ప్రపోజ్ చేయలేదు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వచ్చాం అని కాజల్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

గౌతమ్ రొమాన్స్ విషయంలో అలా
రొమాన్స్ విషయంలో గౌతమ్ సినిమా ఫక్కీలో ఉండరు. అందుకు నేను లక్కిగా భావిస్తా. ఎందుకంటే సినిమాల్లో హీరోలతో సినిమాటిక్ లవ్, ప్రపోజల్, రొమాన్స్ చేసి విసిగిపోయాను. నిజ జీవితంలో సహజమైన ప్రేమను కోరుకొంటున్నాను. నా హృదయం ఉప్పొంగేలా గౌతమ్ నాకు ప్రపోజ్ చేశాడని మాత్రం చెప్పగలను. మా భవిష్యత్ ఘనంగా ఉంటుందనే ఆశాభావంతో ఉన్నాం అని కాజల్ అగర్వాల్ తెలిపారు.


Click it and Unblock the Notifications











