కాజల్ అగర్వాల్ కొత్త విద్య.. కరోనా సమయంలో ఏం చేస్తున్నారో తెలుసా?

మహారాష్రను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. ఇక ఆర్థిక రాజధాని ముంబైని దారుణంగా వేటాడుతున్నది. ఈ క్రమంలో లాక్‌డౌన్, కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో సెలబ్రిటీలందరూ పనులు మానుకోని ఇంటికే పరిమితి అయ్యారు. ఈ క్రమంలో ఇటీవలే పెళ్లి చేసుకొన్న కాజల్ అగర్వాల్ ఏం చేస్తున్నారంటే..

కాజల్ వైవాహిక జీవితం

కాజల్ వైవాహిక జీవితం

గతేడాది అక్టోబర్ 30వ తేదీన పెళ్లి కూతురైన కాజల్ అగర్వాల్‌కు లాక్‌డౌన్ సమయం కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే ఈ బ్యూటీ ప్రస్తుతం భర్త గౌతమ్ కిచ్లూతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. భర్తతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కరోనాయోధులకు కాజల్ దంపతుల రిక్వెస్ట్

కరోనాయోధులకు కాజల్ దంపతుల రిక్వెస్ట్

కరోనా విపత్కర పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సాధారణ ప్రజలకు కాజల్ దంపతులు సోషల్ మీడియా ద్వారా కోరారు. మీరు కరోనా నుంచి బయటపడిన యోధులైతే వెంటనే ప్లాస్మాను డొనేట్ చేసి మరొకరి ప్రాణాలను రక్షించండి. కోవిడ్ పేషెంట్లను కాపాడిన సూపర్ హీరోగా మారండి అంూ ఇన్స్‌టాగ్రామ్ ద్వారా కాజల్, గౌతమ్ కోరారు. మాస్కులు ధరించి వాళ్లు ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు.

హస్తకళకు ప్రాధాన్యం ఇస్తూ..

హస్తకళకు ప్రాధాన్యం ఇస్తూ..


ఇక కరోనావైరస్ పరిస్థితుల్లో ఇంట్లో ఊరికే కూర్చోలేక కొత్త విద్యను మొదలుపెట్టింది. తనకు ఇష్టమైన హస్తకళకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇంట్లో తీరిక వేళల్లో చేతికుట్టు విద్యతో బట్టలు డిజైన్ చేయడం నేర్చుకొంటున్నాను అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

అందరి క్షేమం కోసం ప్రార్థించండి

అందరి క్షేమం కోసం ప్రార్థించండి


ఇన్స్‌టాగ్రామ్‌లో కాజల్ అగర్వాల్ స్పందిస్తూ.. బట్టలు అల్లే విద్యను నేర్చుకొంటున్నాను. అందరి క్షేమం కోసం ప్రార్థించి ప్రేమను కురిపించండి. బయట పరిస్థితులు చాలా డేంజర్‌గా ఉన్నాయి. ప్రతీ ఒక్కరు ఆందోళనకు గురి అవుతున్నారు. కాబట్టి ప్రతీ ఒక్కరు తమకు నచ్చిన పనులపై దృష్టిపెట్టండి. మీలోని క్రియేటివిటిని బయటకు తీయండి అంటూ తన పోస్టులో కాజల్ వెల్లడించారు.

Recommended Video

Acharya కోసం Pushpa Raj తగ్గుతాడా? | Allu Arjun | Megastar Chiranjeevi || Filmibeat Telugu
ప్రొఫెషనల్‌గా కాజల్ అగర్వాల్

ప్రొఫెషనల్‌గా కాజల్ అగర్వాల్


కాజల్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ముంబై సాగా అనే హిందీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె నటించిన క్వీన్ రీమేక్ పారిస్ పారిస్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే ఇండియన్2 చిత్రంలో కమల్‌తో జతకట్టారు. హే సినామికా, ఘోస్ట్‌లీ కబ్జా, ఆచార్య, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X