రవితేజతో కాజల్ అగర్వాల్ రొమాన్స్.. సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తారా!
మాస్ మహారాజ రవితేజ వరుస చిత్రాలతో బిజీగా మారుతున్నాడు. ప్రస్తుతం రవితేజ విఐ ఆనంద్ దర్శత్వంలో డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అమర్ అక్బర్ ఆంటోని తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం ఇదే. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ రవితేజతో తేరి చిత్రాన్ని రీమేక్ చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రం ఆగిపోయిందనుకుంటున్న తరుణంలో మరోమారు వార్తల్లో నిలిచింది.
ఈ చిత్రంలో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని కనకదుర్గ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రవితేజ సరసన కేథరిన్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలిసింది. తాజాగా మరో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్, రవితేజ గతంలో సారొచ్చారు, వీర లాంటి చిత్రాల్లో నటించారు. ఆ రెండు డిజాస్టర్లే.

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ హ్యాట్రిక్ చిత్రం అయినా విజయం సాధిస్తుందో లేదో చూడాలి. తేరి చిత్రంలో కీలక పాయింట్ ని మాత్రమే తీసుకుని మిగిలిన కథ మొత్తం సంతోష్ శ్రీనివాస్ మార్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. డిస్కోరాజాతో బిజీగా ఉన్న రవితేజ కనకదుర్గ చిత్రాన్ని కూడా త్వరలోనే ప్రారంభించాలనుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











