For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాజల్ కండిషన్: పెళ్లికి ముందు ఆ పొజిషన్‌లో సంతృప్తి పరచాలని కోరిక.. కాదనలేక ఒప్పుకున్నా

  |

  టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరుసగా సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ మొన్నటివరకు పెళ్లి గురించి పెద్దగా ప్రస్తావించలేదు. 2020 ఎఫెక్ట్ వల్లనో లేక మరో కారణం చేతనో తెలియదు గాని మొత్తానికి నచ్చినవాడ్ని పెళ్లి చేసుకొని కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. కెరీర్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ ఒక ఇంటీరియర్ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ని పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఏమిటనే వార్తలు ఎన్నో వస్తున్నాయి.

  పెళ్లికి ముందు ఆ అబ్బయితోనే

  పెళ్లికి ముందు ఆ అబ్బయితోనే

  ఇక రీసెంట్ గా కాజల్ గౌతమ్ ప్రపోజ్ గురించి కూడా బయటపెట్టింది. గత ఏడేళ్ళకు పైగా వీరి మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. గతంలో కాజల్ ఒక అబ్బాయిని వెంటేసుకొని తిరుగుతోందని వార్తలు చాలానే వచ్చాయి. ఆ అబ్బాయి మరెవరో కాదు.. గౌతమ్ కిచ్లునే. వారికి సంబంధించిన స్పెషల్ పార్టీ ఫొటోలు కూడా చాలానే వైరల్ అయ్యాయి.

  అవన్నీ అబద్దాలని కుండా బద్దలు కొట్టేసింది

  అవన్నీ అబద్దాలని కుండా బద్దలు కొట్టేసింది

  రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా కాజల్ ఏనాడు అసలు గుట్టు విప్పలేదు. కొన్ని సందర్భాల్లో అయితే నేను రిలేషన్ లో లేనని రూమర్స్ కి కౌంటర్ ఇవ్వడమే కాకుండా తన పెళ్లి నిర్ణయం నా తల్లిదండ్రులకే వదిలేస్తున్నట్లు సమాధానం కూడా ఇచ్చింది. కానీ కాజల్ లాక్ డౌన్ లో పెళ్లి న్యూస్ చెప్పి అవన్నీ అబద్దాలని కుండా బద్దలు కొట్టేసింది.

  సంతృప్తి పరిచాడట

  సంతృప్తి పరిచాడట

  అయితే గౌతమ్ కిచ్లు వందల కోట్ల ఆస్తులపరుడైనప్పటికి గుణంలో అంతకంటే గొప్పవాడట. కాజల్ ని అతను ఎంతగా ప్రేమించాడు అంటే సముద్రం అంచున స్వర్గాన్ని చూపించేంతగా లవ్ చేశాడు. ఇక డేటింగ్ లో ఉన్నప్పుడు చందమామ పెట్టిన కండిషన్స్ ని గౌతమ్ కొంచెం కూడా విభేదించలేదట. పైగా ఆమె మనసుకు నచ్చిన విధంగానే ప్రపోజ్ చేసి సంతృప్తి పరిచాడట. ఆ విషయాన్ని ఇటీవల వివరించింది కాజల్.

  ఆ పొజిషన్ లో మోకాళ్ళపై..

  ఆ పొజిషన్ లో మోకాళ్ళపై..

  కాబోయే వాడు మోకాళ్ళపై నిలబడి ఆ పొజిషాన్ లో రోజా పువ్వు అందించి ప్రపోజ్ చేయాలని అనుకుందట కాజల్. అయితే గౌతమ్ కూడా ఆమె మనసును అర్థం చేసుకొని అంత కోటీశ్వరుడు అయినప్పటికీ ఆమె కోసం ప్రపోజ్ చేశాడు. అందుకే కాజల్ కాధనలేకపోయిందట. అతను చెప్పిన విధానం కూడా ఆమెకు చాలా నచ్చిందట.

  కాబోయే వాడు అలా చేయడంతో..

  కాబోయే వాడు అలా చేయడంతో..

  ప్రపోజ్ చేసే కంటే ముందే గౌతమ్ తీసుకున్న ఒక నిర్ణయం కాజల్ ని ఎంతగానో ఎట్రాక్ట్ చేసినట్లు చెప్పింది. తనతో ప్రేమ విషయం గురించి చెప్పే ముందే తన ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాడట గౌతమ్. ఇక కాబోయే వాడు నా కోసం మోకాళ్ళ మీద నిలబడి ప్రపోజ్ చేస్తేనే ఒప్పుకుంటానని చాలా సార్లు గౌతమ్ తో చెప్పినట్లు వివరణ ఇచ్చిన కాజల్ తనకు లవ్ మ్యారేజ్ అంటేనే ఎక్కువగా ఇంట్రెస్ట్ అని కూడా చెప్పిందట.

  వాయిదా వేసుకుందామని అనుకుందట

  వాయిదా వేసుకుందామని అనుకుందట

  కాజల్, గౌతమ్ ఇద్దరు కూడా పెళ్లి తరువాత హనీమూన్ ను చాలా కాస్ట్లీగానే ప్లాన్ చేసుకున్నారు. మొదట షూటింగ్స్ కారణంగా వాయిదా వేసుకుందామని అనుకుందట చందమామ. కానీ అనుకోకుండా గ్యాప్ దొరకడంతో జోష్ లో ఉండగానే రెడీ అయ్యి హనీమూన్ కోసం హిందూ మహాసముద్రంలోకి వెళ్లిపోయారు. సముద్ర మట్టానికి 16 అడుగుల దిగువన ఉన్న ప్రపంచంలో ఇద్దరు రొమాంటిక్ గా ఎంజాయ్ చేశారు.

  #kajalaggarwal : Kajal Aggarwal Reveals How Gautam Kitchlu Proposed To Her For Marriage
  ఖరీదైన హనీమూన్.. ఖర్చు ఎంతంటే..

  ఖరీదైన హనీమూన్.. ఖర్చు ఎంతంటే..

  ప్రపంచంలోని మొట్ట మొదట నిర్మించిన అత్యంత ఖరీదైన అండర్ వాటర్ హోటల్ మురాకాలో కాజల్, గౌతమ్ చాలానే ఎంజాయ్ చేశారు. కాజల్ తన భర్తతో నీటి అడుగున గాజుతో కప్పబడిన బెడ్ రూమ్ ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. అందమైన వేలాది చేపల నడుమ కొన్నిరోజులుహ్యాపీగా ఎంజాయ్ చేశారు. మురాకాలో ఒక రాత్రికి అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. దాని రెంట్ యాభై వేల డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు. పది రోజుల బసకు ఆహారం, ఇతర సందర్శనా ఖర్చులతో సహా ఐదు కోట్లకు పైగా ఖర్చయినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

  English summary
  Kajal Aggarwal Latest Love symbol post create row, Buzz Is That Kajal Aggarwal Getting Married Gautam Kitchlu, Kajal’s beau’s correct name is Gautam Kitchlu, and he’s a design enthusiast and entrepreneur who runs Discern Living – an ecommerce venture for interior design and home decor solutions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X