#Kajal60 రాకెట్ స్పీడ్‌తో కాజల్ అగర్వాల్.. పెళ్లి తర్వాత కూడా అదే జోష్!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘమైన సినిమా కెరీర్ ఉన్న యువ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. పెళ్లికి ముందు వరుస విజయాలు, వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న ఈ అందాల భామ.. పెల్లి తర్వాత అదే జోష్ కొనసాగిస్తున్నది. వరుస సినిమాలతో బిజీ అవుతూనే ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నది. తాజా ఆమె నటించిన సినిమా #Kajal60 కు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు. కాజల్ తాజా సినిమా వివరాల్లోకి వెళితే..
కాజల్ అగర్వాల్ కెరీర్‌లో 60వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్క సమర్పకుడిగా మారారు. ఈ సినిమాతో అఖిల్ డేగల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాబీ తిక్క నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌ను కాజల్ జన్మదినాన్ని పురస్కరించుకొని విడుదల చేయనున్నారు.

ఇక కాజల్ అగర్వాల్ జన్మదినం జూన్ 19వ తేదీని పురస్కరించుకొని #Kajal60 సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేసి విషెస్ అందజేసేందుకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్‌లో ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తారు అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.
కాజల్ తన కెరీర్‌లో 60వ చిత్రంలో ఇప్పటి వరకు పోషించని పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదనే విషయాన్ని చిత్ర నిర్మాత, దర్శకులు వెల్లడిస్తున్నారు. కాజల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఇప్పటి వరకు వెండితెర మీద కనిపించిన పోలీస్ పాత్రలకంటే విభిన్నంగా ఉంటుంది. కాజల్ పాత్రను మలిచిన తీరు చాలా బాగుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ లుక్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క నిర్మించే ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











