Kajal Aggarwal ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌తో హల్‌చల్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్
దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో భారీ ఆఫర్లు అందుకొంటున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న ఫోటోలను బట్టి స్పష్టమవుతున్నది. గతేడాదిన్నర క్రితం అంటే అక్టోబర్ 30, 2020 తేదీన ముంబైకి చెందిన వ్యాపారి గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోవడం తెలిసిందే. లాక్‌డౌన్ కావడంతో ఇంటికే పరిమితయ్యారు. ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఇక దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తూ కనిపిస్తున్నారు. అయితే గర్బంతో ఉన్న ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video

భర్త గౌతమ్ అధికారికంగా
కొద్ది రోజుల క్రితం కాజల్ గర్బవతి అనే విషయాన్ని ఆమె భర్త గౌతమ్ కిచ్లూ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాజల్ అగర్వాల్ ఫోటో పెట్టి 2022లో అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించబోతున్నాం అని ఓ క్యాప్షన్ పెట్టి.. గర్బవతిగా ఉన్న మహిళ ఫోటోను ఇమోజీగా పెట్టి.. అధికారికంగా తాను తండ్రి కాబోతున్నానని ప్రకటించారు.

2022లో కొత్త అనుభూతులు అంటూ
తాను గర్బవతి అని భర్త పోస్టులో వెల్లడించిన తర్వాత కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. భర్త గౌతమ్‌తో కలిసి ఉబ్బెత్తుగా ఉన్న కడుపు కనిపించేలా ఫోటోను షేర్ చేశారు. పాత మెమొరీస్‌తో కళ్ల మూసుకొన్నాను. జీవితంలో కొత్త ఆరంభం కోసం ఎదురు చూస్తూ కళ్లు తెరువాలని అనుకొంటున్నాను. 2022 సంవత్సరం ప్రేమానురాగాలు పొందాలని ఆశిస్తున్నాను అంటూ కాజల్ పోస్టు పెట్టారు.

దుబాయ్ ప్రభుత్ం గోల్డ్ వీసా
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ దుబాయ్‌లో విహారయాత్ర చేస్తున్నారు. దుబాయ్ ప్రభుత్వం గోల్డ్ వీసా ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడే ఉంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొంటున్నారు. దుబాయ్‌లోని సముద్ర తీరానికి ఎదురుగా ఉన్న రిసార్ట్‌లో ఉంటూ తన ఫోటోలను షేర్ చేశారు. తొలిసారి గర్బంతో ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేయడం గమనార్హం.

లేలేత సూర్య కాంతి నా ముఖాన్ని అంటూ
కాజల్ అగర్వాల్ బేబీ బంప్‌తో కూడిన ఫోటోను తన అధికారిక ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. చాలా సున్నితంగా లేలేత సూర్య కిరణాలు నా ముఖాన్ని ముద్దాడుతున్నాయి అంటూ మెసేజ్ పెట్టారు. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను అభిమానులు చూసి ఆనందంలో మునిగిపోయారు. రకరకాల కామెంట్లతో తన అభిమాన తారను ప్రశంసల్లో ముంచెత్తతున్నారు. లేత నిమ్మకాయ కలర్ టాప్‌లో, డిజైనర్ కళ్ల జోడు పెట్టుకొని ఫోటోలో కనిపించారు.

కాజల్ అగర్వాల్ సినిమా కెరీర్ ఇలా..
కాజల్ అగర్వాల్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌కు ముందు మోసగాళ్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆచార్య, హే సినామిక, కరుంగపియమ్, ఘోస్ట్, ఉమ, నటిస్తుంచారు. పారిస్ పారిస్ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. హే సినామిక చిత్రంలో అదితిరావు హైదరీ, దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటిస్తున్నారు. దుల్కర్ ప్రియురాలిగా ఆమె నటిస్తున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











