Kajal Aggarwal తల్లైనా తరగని అందం.. హారర్ కామెడీ కోస్టీలో కాజల్ డబుల్ ధమాకా!

దక్షిణాదిలో అగ్రతార కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత మరో ఇన్సింగ్స్‌ను క్రేజీగా మొదలుపెట్టారు. భారీ బడ్జెట్ చిత్రాలు, అగ్రహీరోల సినిమాలతో బిజీగా మారారు. దక్షిణాదిలో వరుస ఆఫర్లు చేజిక్కించుకొంటున్న కాజల్ ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాధిక శరత్ కుమార్, కమెడియన్ యోగిబాబు‌తో కలిసి కోస్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి, కాజల్ చేస్తున్న సినిమాల గురించిన వివరాల్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణతో చందమామ

నందమూరి బాలకృష్ణతో చందమామ


టాలీవుడ్‌లో ప్రస్తుతం బాలకృష్ణతో ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్టులో నటిస్తున్నది. ఈ చిత్రం షూటింగు హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నది. ఇటీవలే కాజల్ ఈ సినిమా షూట్‌కు హాజరు అవ్వనున్నారు. బాలకృష్ణ కెరీర్‌లో 108వ చిత్రం NBK108 చిత్రంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నది. ఓ పక్క సినిమా షూటింగులతో బిజీగా ఉంటూనే.. తమిళ, తెలుగు భాషల్లో ఘోస్టీ (తెలుగులో కోస్టి) సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

హారర్ కామెడీ చిత్రంలో కాజల్

హారర్ కామెడీ చిత్రంలో కాజల్


హారర్ కామెడీగా కోస్టి చిత్రం తెరకెక్కింది. ఇందులో తండ్రి కుమార్తె మధ్య అనుబంధాన్ని కూడా చూపించారు. కథ విషయానికి వస్తే, అనగనగా అందమైన లేడీఇన్‌స్పెక్టర్. ఆమె పేరు ఆరతి. గ్యాంగ్‌స్టర్ దాస్ జైలు నుంచి తప్పించుకుంటాడు. అతడిని పట్టుకుని తీరుతానని శపథం చేస్తుంది. కొన్నేళ్ల క్రితం ఆరతి తండ్రి దాసును అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. దాసును పట్టుకునే క్రమంలో అతడినిషూట్ చేయబోయి మరొకరిని షూట్ చేస్తుంది ఆరతి. ఆ తర్వాత ఏమైందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

కోస్టీలో ట్విస్టులు ఇవే..

కోస్టీలో ట్విస్టులు ఇవే..


ఆరతి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించారు.గ్యాంగ్‌స్టర్ దాస్ రోల్ ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ చేశారు. ఆరతితోపాటు పని చేసే పోలీసులుగా సీనియర్ నటి ఊర్వశి, సత్యన్ కనిపించనున్నారు. పోలీస్ కథకు, దర్శకుడు కావాలని ప్రయత్నించే యోగిబాబు పాత్రకు సంబంధం ఏమిటి? మధ్యలో మానసిక వికలాంగులకు సంబంధించిన ఆస్పత్రికియోగిబాబు ఎందుకు వెళ్లారు? అనేది ఆసక్తికరం. సినిమాలోరిడిన్ కింగ్ స్లే, తంగదొరై, జగన్, ఊర్వశి, సత్యన్, ఆడు కాలం నరేన్, మనోబాల, రాజేంద్రన్, సంతాన భారతి, దేవదర్శిని వంటి భారీ తారాగణం ఉంది.

 కేఎస్ రవికుమార్ విలన్‌గా

కేఎస్ రవికుమార్ విలన్‌గా


గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మాట్లాడుతూ ''హారర్ కామెడీ చిత్రమిది. ఇందులో హారర్, కామెడీతోపాటు థ్రిల్ ఇచ్చే అంశాలు ఉన్నాయి. ప్రేక్షకులు ఉలిక్కిపడి సన్నివేశాలు ఉన్నాయి. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రను కాజల్ అగర్వాల్ పోషించారు. అలాగే, అందంగానూకనిపించారు. తెలుగు ప్రేక్షకులకు కొత్త కాజల్ కనపడతారు. ఊర్వశి, యోగిబాబు, కెఎస్రవికుమార్, మనోబాల అద్భుతంగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిన యంగ్ తమిళ హీరో అతిథి పాత్రలో కనిపించారు. ఆయన క్యారెక్టర్ ప్రేక్షకులనుసర్‌ప్రైజ్ చేస్తుంది. సామ్సిఎస్సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఉగాదికి తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదం అందించే చిత్రమిది. ఈ నెల 22న థియేటర్లలో విడుదల చేస్తున్నాం'' అని చెప్పారు.

కాజల్ సినిమా కెరీర్ ఇలా..

కాజల్ సినిమా కెరీర్ ఇలా..


ఇక కాజల్ అగర్వాల్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. కమల్ హాసన్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో నటిస్తున్నారు. 2023లో తన తొలి చిత్రంగా ఘోస్టీ రిలీజ్ అవుతున్నది. అలాగే ఇండియన్ 2, కరుంగాపియమ్, ఉమ చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X