కాజల్ హానిమూన్‌కు అడ్డుపడుతున్న ఆచార్యుడు.. విదేశీ పర్యటన ఎప్పుడు? ఎక్కడికంటే!

దక్షిణాది స్టార్ కాజల్ అగర్వాల్ పెళ్లి తన ప్రియుడు గౌతమ్ కిచ్లూతో అత్యంత నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ముంబైలోని హోటల్ తాజ్ కొలాబాలో జరిగిన వివాహం కోసం వేదికను అంగరంగవైభవంగా తీర్చిదిద్దారు. అయితే కాజల్ తన పెళ్లి తర్వాత హనీమూన్ ఎలా ప్లాన్ చేసుకొన్నదంటే..

తుఫాన్‌కు ముందు కాజల్ ప్రశాంతత

తుఫాన్‌కు ముందు కాజల్ ప్రశాంతత

పెళ్లికి ముందు జరిగిన సంగీత్ వేడుక సందర్భంగా అందంగా ముస్తాబైన కాజల్ అగర్వాల్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఇది తుఫాన్‌కు ముందు ప్రశాంతత అంటూ కామెంట్ చేసింది. అంతేకాకుండా అభిమానులకు శుభవార్తను అందించింది. పెళ్లి తర్వాత కూడా ఎప్పటిలానే మీకు వినోదాన్ని పంచుతాను. నటనకు దూరం కాను అంటూ భావోద్వేగానికి లోనైంది.

గుజరాతీ, కశ్మీరి సంప్రదాయాలకు అనుగుణంగా

గుజరాతీ, కశ్మీరి సంప్రదాయాలకు అనుగుణంగా

కాజల్ అగర్వాల్ గుజరాతీ కావడం, ప్రియుడు గౌతమ్ కిచ్లూ కశ్మీరి అవ్వడం వల్ల ఆ రెండు ప్రాంతాలకు అనుగుణంగా సంప్రదాయ పద్దతిలో వివాహం జరిపించారు. మెడలో మూడు మూళ్లు వేసిన తర్వాత అగ్నిమండపం చుట్టూ కాజల్, గౌతమ్ ప్రదక్షిణలు చేశారు. వేద బ్రహ్మణుల సూచన మేరకు పలు సంప్రదాయాలను, ఆచారాలను పాటించారు.

రెండు వారాలపాటు షూటింగులకు బ్రేక్

రెండు వారాలపాటు షూటింగులకు బ్రేక్

పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ షూటింగుల నుంచి రెండు వారాలపాటు బ్రేక్ తీసుకోనున్నారు. అయితే ఇరు కుటుంబాల మధ్య కొన్ని వేడుకలు ఉన్నందున హానీమూన్‌ను వాయిదా వేసుకొన్నట్టు సమాచారం. అంతేకాకుండా కోవిడ్ పరిస్థితులు కూడా ఉండటంతో కొన్నాళ్లు ఆగి హానిమూన్‌ను ప్లాన్ చేసుకొన్నట్టు తెలిసింది.

నవంబర్ రెండోవారంలో ఆచార్య కోసం

నవంబర్ రెండోవారంలో ఆచార్య కోసం

ఇక కాజల్ హానిమూన్‌కు ఆచార్య సినిమా అడ్డుపడినట్టు తెలిసింది. నవంబర్ రెండోవారంలో జరిగే ఆచార్య షూటింగులో చిరంజీవితో కలిసి కొన్ని సన్నివేశాల్లో నటించనున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన ఆచార్య షూటింగు నవంబర్ రెండో వారంలో మొదలు కాబోతున్నది. అందు వలన సినిమా కోసం హానిమూన్ కొద్ది రోజులు వాయిదా వేయాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం.

నవంబర్ చివరికల్లా హానిమూన్ ప్లాన్స్

నవంబర్ చివరికల్లా హానిమూన్ ప్లాన్స్

ఆచార్య షూటింగ్ తర్వాత కాజల్, గౌతమ్ హానిమూన్ ట్రిప్‌కు ప్లాన్ చేసుకొన్నట్టు తెలిసింది. అంతా సవ్యంగా జరిగితే నవంబర్ మూడో వారంలో గానీ, నాలుగో వారంలో గానీ కాజల్ దంపతులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. త్వరలోనే హానిమూన్‌ ప్లాన్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కాజల్ అగర్వాల్ కెరీర్ ఇలా..

కాజల్ అగర్వాల్ కెరీర్ ఇలా..

ఇదిలా ఉండగా, కాజల్ అగర్వాల్ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆచార్య సినిమాతోపాటు మంచు విష్ణుతో మోసగాళ్లు అనే చిత్రంలో నటించింది. అలాగే కమల్ హాసన్‌తో ఇండియన్2 సినిమాలో నటిస్తున్నది. ఇండియన్ 2 షూటింగ్‌కు సంబంధించి ఆమె పాత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందనే సమాచారం. ఇంకా పలు ప్రాజెక్టుల చర్చల దశలో ఉన్నాయి. పెళ్లి తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించే ప్లాన్స్ చేసుకొన్నారు. ఇప్పటికే KA అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను రిజిస్టర్ చేసుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X