బూతు సీన్లతో రెచ్చిపోయిన కాజల్.. ఆమె చేసిన పనికి ఆ ముగ్గురు హీరోయిన్లకు భారీ షాక్.!

By Manoj Kumar P

కాజల్ అగర్వాల్... తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు హవా చూపించిన హీరోయిన్. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ అమ్మడు.. కొన్నేళ్లుగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. చేసిన ఒకటి రెండు సినిమాలు బాక్సాఫీస్ ముందు బోల్తా పడడం.. పలువురు కొత్త హీరోయిన్లు సక్సెస్ అవుతుండడం వంటి కారణాతో కాజల్ అవకాశాలను దక్కించుకోలేకపోతోంది. ఇక, ఇటీవల ఆమె బూతులతో రెచ్చిపోయింది. దీంతో ముగ్గురు హీరోయిన్లకు భారీ షాక్ తగిలింది. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

స్టార్ హీరోకు చెల్లిగా కాజల్.. అది ఆగింది

స్టార్ హీరోకు చెల్లిగా కాజల్.. అది ఆగింది

కొన్నేళ్లుగా కాజల్ అగర్వాల్‌కు అవకాశాలు పెద్దగా రావడం లేదు. దీంతో ఆమె ఏ రోల్ చేయడానికైనా సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే మంచు విష్ణు నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘మోసగాళ్లు'లో కాజల్ అతడికి సోదరిగా నటిస్తోంది. అలాగే, సంచలన మూవీ ‘భారతీయుడు' సీక్వెల్‌లో కూడా నటిస్తున్నా.. ఆ సినిమా ఇటీవల ఆగిపోయిన విషయం తెలిసిందే.

సూపర్ హిట్ సినిమాతో వద్దామనుకుంది

సూపర్ హిట్ సినిమాతో వద్దామనుకుంది

బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన ‘క్వీన్' సినిమా తమిళ రీమేక్‌లో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేసింది. ‘ప్యారిస్ ప్యారిస్' టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాను మీడియంట్‌ ఫిలిం పతాకంపై మనుకుమార్‌ నిర్మించారు. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా గతంలో విడుదలైంది. అయితే, సినిమా విడుదల మాత్రం ఆగిపోయింది.

బూతు సీన్లతో రెచ్చిపోయిన కాజల్‌కు షాక్

‘ప్యారిస్ ప్యారిస్' సినిమా వాస్తవానికి ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే టీజర్ కూడా విడుదలైంది. అయితే, సినిమా మాత్రం సెన్సార్ దగ్గరే ఆగిపోయింది. దీనికి కారణం టీజర్‌లో చూపించిన బోల్డ్ సీన్‌తో పాటు సినిమాలో బూతు మాటలు, అసభ్యకర సన్నివేశాలు ఉండడమేనని ప్రచారం జరిగింది. వాటిని తొలగించేందుకు చిత్ర యూనిట్ ఒప్పుకోకపోవడంతో రిలీజ్ ఆగింది.

అక్కడకు వెళ్లినా కాజల్‌కు నిరాశ తప్పలేదు

అక్కడకు వెళ్లినా కాజల్‌కు నిరాశ తప్పలేదు

కాజల్ నటించిన ఈ సినిమా సూచిన తర్వాత ‘ఏ' సర్టిఫికెట్ అవ్వడంతో పాటు 25 వరకూ ఆడియో, వీడియో కట్స్‌ను ప్రతిపాదించింది సెన్సార్ బోర్డ్. దీనికి చిత్ర యూనిట్ అంగీకరించకపోవడానికి తోడు రివైజింగ్ కమిటీకి వెళ్లింది. అయినప్పటికీ చిత్ర యూనిట్‌కు నిరాశ తప్పలేదు. సినిమా చూసిన కమిటీ సభ్యులు సెన్సార్ బోర్డుకు మద్దతుగా నిలవడంతో సినిమా రిలీజ్‌కు బ్రేక్ పడిపోయింది.

 ఆ ముగ్గురు హీరోయిన్లకు కష్టాలు తప్పలేదు

ఆ ముగ్గురు హీరోయిన్లకు కష్టాలు తప్పలేదు

యూనివర్శల్ కాన్సెప్ట్ ఉన్న కథ కావడంతో ‘క్వీన్'ను దక్షిణాదిలోని అన్ని భాషల్లో తెరకెక్కించారు. తెలుగులో తమన్నా హీరోయిన్‌గా ‘దటీజ్‌ మహాలక్ష్మి', కన్నడంలో పరూల్‌మాధవ్‌ హీరోయిన్‌గా ‘బటర్‌ఫ్లై', మలయాళంలో మంజిమామోహన్‌ హీరోయిన్‌గా ‘జామ్‌జామ్‌' పేరుతో రూపొందింది. అయితే, కాజల్ సినిమా ఆగిపోవడంతో ఇవి కూడా రిలీజ్ కాలేదు.

Recommended Video

Kajal Aggarwal Attracts Youth With Her Latest Photo Shoot || Filmibeat Telugu
చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం.. వాళ్లకు షాక్

చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం.. వాళ్లకు షాక్

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో ఒకే నిర్మాణ సంస్థ నిర్మించినందున అన్నింటినీ ఒకే సారి విడుదల చేయాలని భావించారు. అయితే, ‘ప్యారిస్ ప్యారిస్'కు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మిగిలిన చిత్రాలను కూడా విడుదల చేయకూడదని చిత్ర యూనిట్ తాజాగా నిర్ణయించుకున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. అంటే కాజల్ సినిమా వల్ల మూడు ఆగిపోయాయన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X