బోల్డ్ సీన్లతో రెచ్చిపోయిన కాజల్: ఎట్టకేలకు ఆ సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్!

By Manoj Kumar P

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు తన హవాను చూపించింది కాజల్ అగర్వాల్. తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ... స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే దాదాపు అందరు హీరోలతో నటించి మెప్పించింది. అంతేకాదు, ఎవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా సినిమాలు చేసింది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో కాజల్ ఎప్పుడో నటించి ఆగిపోయిన ఓ 'బూతు' సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతుందట. ఆ వివరాలు మీకోసం.!

అప్పుడు ఫుల్ బిజీ.. ఇప్పుడు నిల్

అప్పుడు ఫుల్ బిజీ.. ఇప్పుడు నిల్


ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ఆమె నటించిన సినిమాలు చాలా వరకు హిట్లుగా నిలుస్తుండడంతో ఫిల్మ్ మేకర్లు ఆమె డేట్స్ కోసం వేచి చూసేవారు. అయితే, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. చేసిన సినిమాలు మధ్యలోనే ఆగిపోవడమో.. ఫ్లాప్ అవడమో కారణంగా అవకాశాలు సన్నగిల్లిపోయాయి.

హీరోకు చెల్లిగా.. చిరంజీవికి జోడీగా

హీరోకు చెల్లిగా.. చిరంజీవికి జోడీగా


ప్రస్తుతం కాజల్ అగర్వాల్ పరిస్థితి ఏమంత బాగోలేదు. అందుకే వచ్చిన చిన్న అవకాశాలను సైతం ఆమె వదులుకోవడం లేదు. ఇందులో భాగంగానే మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘మోసగాళ్లు' అనే మూవీలో అతడికి చెల్లెలిగా నటిస్తుంది. అలాగే, మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘ఆచార్య'లోనూ ఆడిపాడనుందీ కాజల్ అగర్వాల్.

ఛాన్స్‌లు లేకున్నా.. తగ్గడం లేదుగా

ఛాన్స్‌లు లేకున్నా.. తగ్గడం లేదుగా

గతంలో మాదిరిగా సినిమాలు అవకాశాలు రాకున్నా... కాజల్ అగర్వాల్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. కెరీర్ ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలో ఎంత చార్జ్ చేసిందో... ఇప్పుడు కూడా అంతే ఇవ్వమని నిర్మాతల ముందు డిమాండ్ చేస్తోంది. ఈ కారణంగానూ కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. అందుకే ఆమె సినిమాలు తగ్గిపోతున్నాయని అంటున్నారు.

బోల్డ్ సీన్లతో రెచ్చిపోయిన కాజల్

బోల్డ్ సీన్లతో రెచ్చిపోయిన కాజల్

బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘క్వీన్' సినిమాను తమిళంలో ‘ప్యారిస్ ప్యారిస్' టైటిల్‌తో తెరకెక్కించారు. ఈ రీమేక్‌లో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేసింది. ఈ సినిమాను మీడియంట్‌ ఫిలిం పతాకంపై మనుకుమార్‌ నిర్మించారు. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా గతంలో విడుదలైంది. ఇందులో కాజల్ బోల్డ్ సీన్లతో రెచ్చిపోయింది.

ముగ్గురు హీరోయిన్లు చేయలేదు

ముగ్గురు హీరోయిన్లు చేయలేదు


యూనివర్శల్ సబ్జెక్ట్‌తో వచ్చిన సినిమా కావడంతో ‘క్వీన్'ను దక్షిణాదిలోని అన్ని భాషల్లో తెరకెక్కించారు. తెలుగులో తమన్నా హీరోయిన్‌గా ‘దటీజ్‌ మహాలక్ష్మి', కన్నడంలో పరూల్‌మాధవ్‌ హీరోయిన్‌గా ‘బటర్‌ఫ్లై', మలయాళంలో మంజిమామోహన్‌ హీరోయిన్‌గా ‘జామ్‌జామ్‌' పేరుతో రూపొందింది. ఈ మూడు చోట్లా సెన్సార్ క్లియరెన్స్ రాగా.. కాజల్ సినిమా మాత్రం ఆగిపోయింది.

Recommended Video

Indian 2 Financial Hurdles Becoming Headache For Director Shankar
‘బూతు' సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్.!

‘బూతు' సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్.!

వాస్తవానికి ‘క్వీన్' మూవీ ఏమంత బోల్డుగా ఉండదు. కానీ, కాజల్ నటించిన ‘ప్యారిస్ ప్యారిస్'లో మాత్రం కొన్ని సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగుల వల్ల ఇది ‘బూతు' సినిమా అని ముద్ర పడింది. ఈ కారణంగానే చిత్ర యూనిట్ ఎంత పోరాడినా సినిమా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో దీన్ని ఓటీటీలో విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించుకున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X