సెగలు పుట్టిస్తున్న కాజల్ సెక్సీ లుక్.. డబుల్ ట్రీట్‌తో రణరంగమే!
దశాబ్ద కాలంగా వెండితెరపై పంజాబీ భామ కాజల్ అగర్వాల్ హవా ఏ మాత్రం తగ్గటం లేదు. భాషాబేధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న సీనియర్ భామ ఇప్పటికే హాఫ్ సెంచరీ కొట్టేసి మంచి జోష్‌లో ఉంది. నేటి అప్‌కమింగ్ హీరోయిన్లను మించిన అందంతో క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉంది. ఇక ఇటీవలే 'సీత' రూపంలో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ మరికొద్ది రోజుల్లో 'రణరంగం' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తన కెరీర్‌లో 51వ సినిమాగా వచ్చిన 'సీత'లో పవర్ ఫుల్ లేడీ పాత్ర పోషించిన కాజల్.. ప్రెసెంట్ మూవీ 'రణరంగం'లో ఫుల్లీ గ్లామరస్ పాత్రలో కనిపించనుందట. ప్రస్తుతం కాజల్‌కు సంబందించిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సముద్రం ఒడ్డున ఓ గ్యాలరీలో సెక్సీ పోజిచ్చి తన గ్లామర్ అంతా బయట పెట్టింది కాజల్. 34 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందచందాలతో కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె పోజు చూస్తుంటే వెండితెరపై అందాలతో రణరంగం తలపిస్తుందని అనిపిస్తోంది.

ఇక రణరంగం సినిమా విషయానికొస్తే.. సుధీర్ వర్మ దర్శకతంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాంగ్‌స్టర్ కథాంశంతో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా ఈ చిత్రం రూపొందించబడుతోంది. అయితే ఈ చిత్రంలో కాజల్ మాత్రం గ్లామర్ డోస్ మరింత పెంచిందని సమాచారం. ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు తమిళంలో ఆమె నటించిన మరో సినిమా 'కోమలి' కూడా అదే రోజు విడుదల కానుంది. అంటే ఒకేసారి కాజల్ అగర్వాల్ డబుల్ ట్రీట్ ఇవ్వనుందన్నమాట.


Click it and Unblock the Notifications











