Don't Miss!
- News భద్రాద్రి రామయ్య కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ గ్రీన్ సిగ్నల్
- Sports KKR vs RR: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్! వీడియో
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
అబ్బో! కాజల్‌లో ఈ కళ కూడా ఉందా..? తలక్రిందులుగా పరేషాన్ చేసేసిందిగా!
ఒక్కోసారి సోషల్ మీడియాలో కనిపించే కొన్ని పిక్స్ షాకిస్తుంటాయి. అస్సలు ఊహించని కొన్ని సందర్భాలు ఒక్కసారిగా కంటబడటంతో ఆశ్చర్యపోతుంటారు నెటిజన్లు. అయితే ఇలాంటి పరిస్థితి హీరోయిన్ల విషయంలో జరిగితే ఆ షాక్ మరింత స్ట్రాంగ్‌గా ఉంటుంది. తాజాగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పిక్ ఒకటి నెట్టింట చెక్కర్లు కొడుతూ వావ్! అనిపిస్తోంది.
ఈ పిక్‌లో తలక్రిందులుగా కనిపించి పరేషాన్ చేసింది కాజల్. తన బాడీ ఫిట్టింగ్ కోసం చేస్తున్న కాజల్ చేస్తున్న వ్యాయామం తాలూకు పిక్ ఇది. సాధారణంగా హీరోయిన్స్ అన్నాక వ్యాయాయం చేయడం, జిమ్ములకెల్లడం కామన్ గానే చూస్తుంటాం. కానీ ఇలా తలక్రిందులుగా వ్యాయామం చేయడం అరుదుగా చూస్తుంటాం. అందుకే కాజల్ చేసిన ఈ ఫీట్ తాలూకు పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ సీనియర్ హీరోయిన్ అయి ఉండి ఫిట్నెస్ కోసం ఇంతలా పరితపిస్తుందంటే.. సినిమాల పట్ల కాజల్‌కి ఇంకా ఏ మాత్రం ఏకాగ్రత పోలేదని అర్థమవుతోంది. ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే.. తన కెరీర్లో 50 సినిమాల మార్క్ కూడా దాటేసిన ఈ బ్యూటీ ఇటీవలే సీత, రణరంగం సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి నిరాశ చెందింది. ప్రస్తుతం కాజల్ ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోందని సమాచారం. అవకాశం వస్తే చిన్న హీరోనా, పెద్ద హీరోనా అని చూడకుండా కొత్త సినిమాలకు కమిట్ అయ్యేందుకు రెడీగా ఉందట కాజల్.