twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అబ్బో! కాజల్‌లో ఈ కళ కూడా ఉందా..? తలక్రిందులుగా పరేషాన్ చేసేసిందిగా!

    |

    ఒక్కోసారి సోషల్ మీడియాలో కనిపించే కొన్ని పిక్స్ షాకిస్తుంటాయి. అస్సలు ఊహించని కొన్ని సందర్భాలు ఒక్కసారిగా కంటబడటంతో ఆశ్చర్యపోతుంటారు నెటిజన్లు. అయితే ఇలాంటి పరిస్థితి హీరోయిన్ల విషయంలో జరిగితే ఆ షాక్ మరింత స్ట్రాంగ్‌గా ఉంటుంది. తాజాగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పిక్ ఒకటి నెట్టింట చెక్కర్లు కొడుతూ వావ్! అనిపిస్తోంది.

    ఈ పిక్‌లో తలక్రిందులుగా కనిపించి పరేషాన్ చేసింది కాజల్. తన బాడీ ఫిట్టింగ్ కోసం చేస్తున్న కాజల్ చేస్తున్న వ్యాయామం తాలూకు పిక్ ఇది. సాధారణంగా హీరోయిన్స్ అన్నాక వ్యాయాయం చేయడం, జిమ్ములకెల్లడం కామన్ గానే చూస్తుంటాం. కానీ ఇలా తలక్రిందులుగా వ్యాయామం చేయడం అరుదుగా చూస్తుంటాం. అందుకే కాజల్ చేసిన ఈ ఫీట్ తాలూకు పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

    Kajal Aggarwal sensational pic viral on Social media

    ఓ సీనియర్ హీరోయిన్ అయి ఉండి ఫిట్‌నెస్ కోసం ఇంతలా పరితపిస్తుందంటే.. సినిమాల పట్ల కాజల్‌కి ఇంకా ఏ మాత్రం ఏకాగ్రత పోలేదని అర్థమవుతోంది. ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే.. తన కెరీర్‌లో 50 సినిమాల మార్క్ కూడా దాటేసిన ఈ బ్యూటీ ఇటీవలే సీత, రణరంగం సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి నిరాశ చెందింది. ప్రస్తుతం కాజల్ ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోందని సమాచారం. అవకాశం వస్తే చిన్న హీరోనా, పెద్ద హీరోనా అని చూడకుండా కొత్త సినిమాలకు కమిట్ అయ్యేందుకు రెడీగా ఉందట కాజల్.

    English summary
    Kajal Aggarwal's recenty gave double treet to audians, but it not succeed. Now Kajal sheres a sensational pic social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X