భర్తతో టాలీవుడ్ హీరోయిన్ లిప్‌లాక్: ఆ ఫొటోను షేర్ చేసిన కాజల్.. పర్సనల్ పిక్ లీక్ చేయడంతో రచ్చ
చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. మైమరపించే నటన.. ఫిదా చేయగల హవభావాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది చందమామ కాజల్ అగర్వాల్. అప్పుడెప్పుడో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ.. చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకెళ్లింది. ఇలా చాలా ఏళ్ల పాటు చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపింది.
అయితే, కొంత కాలంగా కాజల్ సినిమాలు పెద్దగా చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ లిప్ లాక్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా వచ్చి పాపులర్ అయిన కాజల్
కాజల్ అగర్వాల్ మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే కల్యాణ్ రామ్ నటించిన 'లక్ష్మీ కల్యాణం'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. తొలినాళ్లలోనే తన నటనతో మెప్పించిన ఈ బ్యూటీ.. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎన్నో హిట్ చిత్రాల్లో భాగం అయింది. దీంతో లక్కీ హీరోయిన్‌గా పేరొంది రెమ్యూనరేషన్ కూడా బాగానే బ్యాగులో వేసుకుంది.

ఎవరినీ వదిలిపెట్టని చందమామ
అనతి కాలంలోనే హీరోయిన్‌గా ఎన్నో హిట్లను అందుకోవడంతో కాజల్ పేరు టాలీవుడ్‌లో హైలైట్ అయింది. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుంది. ఫలితంగా అప్పట్లో తన హవాను చూపించింది. ఇక, రోజులు గడిచిన కొద్దీ స్టార్లతోనే కాకుండా జూనియర్ హీరోల సినిమాల్లోనూ నటించి తెగ సందడి చేసేసింది.

పెళ్లి తర్వాత స్పీడు తగ్గించేసింది
టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్ చాలా కాలం పాటు స్టార్‌డమ్‌ను చూపిస్తూ దూసుకుపోయింది. ఇలా దాదాపు ఐదారేళ్ల పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లోనూ నటించింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆమె సినిమాల వేగాన్ని పూర్తిగా తగ్గించేసింది. దీంతో ఆమె అభిమానులు మాత్రం చాలా బాధగా ఉన్నారు.

తల్లి కాబోతున్న కాజల్.. తప్పుకుని
పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ కెరీర్‌ను కొనసాగించాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు చిత్రాల్లోనూ నటించింది. కానీ, ఇటీవలే అక్కినేని నాగార్జున నటిస్తోన్న 'ఘోస్ట్' నుంచి తప్పుకుంది. అలాగే, తమిళ చిత్రం 'రౌడీ బేబీ' నుంచి కూడా బయటకు వచ్చేసింది. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అవడం వల్లే ఇలా తప్పుకుందన్న ప్రచారం మొదలైంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా
కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు పెద్దగా వెండితెరపై కనిపించకపోయినా.. కాజల్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌కు నిరంతరం టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించడంతో పాటు అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది.

లిప్‌లాక్ ఫొటో షేర్ చేసిన కాజల్
సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసే కాజల్ అగర్వాల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ రొమాంటిక్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఒక జంట లిప్ లాక్ ఇచ్చుకుంటూ కనిపించింది. వాళ్లు ఎవరో కాదు.. టాలీవుడ్ హీరోయిన్ నిషా అగర్వాల్, ఆమె భర్త. అవును.. వాళ్లిద్దరి ఫొటోనే కాజల్ షేర్ చేసింది. దీంతో ఇది తెర వైరల్ అయింది. కాజల్‌కు నిషా అగర్వాల్ చెల్లెలు అని తెలిసిందే.

పర్సనల్ ఫొటో.. ఆమెపై విమర్శలు
డిసెంబర్ 28న నిషా అగర్వాల్ పెళ్లిరోజు. దీన్ని పురస్కరించుకుని ఆమెకు చాలా మంది ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ఇందులో భాగంగానే కాజల్ అగర్వాల్ కూడా తన విషెస్‌ను చెప్పేందుకు వాళ్లిద్దరి లిప్‌లాక్ ఫొటోను వాడుకుంది. దీంతో ఈ పిక్ వైరల్ అవడంతో పాటు కాజల్‌పై విమర్శలు వస్తున్నాయి. పర్సనల్ ఫొటోను షేర్ చేసిందని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











