Kajal Aggarwal కొడుకు నీల్ కిచ్లూ ఫోటో వైరల్.. సమంత, రాశీఖాన్నా, కీర్తీ సురేష్ రియాక్షన్ మూమూలుగా లేదుగా!

అందాల తార కాజల్ అగర్వాల్ మాతృత్వపు అనుభూతులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. తన కుమారుడితో అద్బుతమైన క్షణాలను ఆస్వాదిస్తున్నది. ప్రతీ క్షణాన్ని విలువైన మధురానుభూతిగా మార్చుకొంటున్నది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారిన కాజల్ తాజాగా తన కుమారుడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోపై సమంత, రాశీ ఖాన్నా, కీర్తీ సురేష్ కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఇన్స్‌టాగ్రామ్‌లో ట్రెండింగ్‌గా మారింది. కాజల్ చేసిన పోస్టు వివరాల్లోకి వెళితే..

పండంటి మగబిడ్డకు జన్మ

పండంటి మగబిడ్డకు జన్మ

ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ప్రేమలో పడిన కాజల్ అగర్వాల్ కొద్ది రోజులు డేటింగ్ చేసింది. చివరకు అక్టోబర్ 2020లో గౌతమ్, కాజల్ ముంబైలోని ప్రముఖ హోటల్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా వివాహం చేసుకొన్నారు. అయితే ఏప్రిల్ 2022లో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

నీల్ కిచ్లూ గురించి సోషల్ మీడియాలో

నీల్ కిచ్లూ గురించి సోషల్ మీడియాలో

తన తొలి సంతానానికి నీల్ కిచ్లూ అని నామకరణం చేశారు. కుమారుడు పుట్టినప్పటి నుంచి కాజల్ అగర్వాల్ భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో ఆనందాన్ని పంచుకొంటున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అనుభూతులను పంచుకొంటున్నారు.

నీవే నా సర్వస్వం అంటూ

నీవే నా సర్వస్వం అంటూ

కాజల్ అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ.. తన కుమారుడిపై ప్రేమను చాటుకొన్నారు. నా ప్రియాతిప్రియమైన నీల్ కిచ్లూ. నా ప్రపంచం నువ్వే.. నీపై నాకు ఎంత ప్రేమ ఉందంటే... నీవే నాకు సర్వస్వం.. నీపై వెలకట్టలేని ప్రేమ ఉంది. నిన్ను నా చేతుల్లోకి తీసుకొని,.. హృదయానికి హత్తుకొంటే ఆ ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేను అంటూ కాజల్ ఇన్స్‌టాగ్రామ్లో పోస్టు పెట్టింది.

తల్లిగా స్వచ్చమైన ప్రేమను

తల్లిగా స్వచ్చమైన ప్రేమను

కాజల్ తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో స్పందిస్తూ.. నీవు నాకు మొట్టమొదటి చిన్నారివి. నా మొదటి కుమారుడివి. నీకు అన్ని మంచి విషయాలనే చెబుతాను. ఇప్పటికే నాకు వెలకట్టలేని అనుభవాలను నేర్పావు. తల్లిగా నాకు స్వచ్చమైన ప్రేమేంటో చెప్పావు. ఇంకా నీ నుంచి జీవితంలో కొత్త విషయాలు నేర్చుకొంటాను. ప్రపంచానికి కొత్త వెలుగు తీసుకొచ్చే విధంగా నిన్ను పెంచుతాను అంటూ ఎమోషనల్ అయ్యారు.

నా గుండె చప్పుడు నీవే అంటూ

తాజాగా సోమవారం కాజల్ అగర్వాల్ ఎమోషనల్ పోస్టు పెట్టారు. నీల్ కిచ్లూ.. నా జీవితంలోని ప్రేమవు నువ్వు. నా గుండె చప్పుడివి నీవే అంటూ తన కుమారుడి ఫోటోను షేర్ చేసింది. ముఖాన్ని కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఫోటోను చూపించి.. చూపించకుండా తీసింది. తన ఒడిలో పెట్టుకొన్న ఫోటోను షేర్ చేస్తూ.. తన ఎమోషన్‌ను బయటపెట్టింది.

9 లక్షల మంది లైక్ కొట్టి

9 లక్షల మంది లైక్ కొట్టి

కాజల్ అగర్వాల్ పోస్టు చేసిన ఫోటోకు ఇన్స్‌టాగ్రామ్‌లో భారీ స్పందన లభించింది. కేవలం కొద్ది గంటల్లోనే దాదాపు 9 లక్షల మంది లైక్ కొట్టారు. కాజల్ షేర్ చేసిన ఫోటోపై రాశిఖన్నా రెండు హార్ట్స్ పెట్టి లైక్ కొట్టింది. ఇక కీర్తీ సురేష్ మాత్రం ఓ మైగాడ్ అంటూ కొన్ని ఎమోజీలను పోస్టు చేసింది. సమంత ప్రేమతో లైక్ కొట్టింది. కాజల్ షేర్ చేసిన కొడుకు ఫోటో ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకొంటున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X