నా కొడుకుకు ఆ వీడియోలు చూపించను.. ఇంకా 18 నెలలే కదా.. కాజల్ అగర్వాల్
తెలుగు సినిమా ప్రపంచంలో సుమారుగా 2 దశాబ్దాలుగా ప్రేక్షకులను తన అందం, అభినయంతో మెప్పిస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన కాజల్ ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నది. మేజర్ మూవీ డైరెక్టర్ శశికిరణ్ తిక్క క్రియేటివ్ డైరెక్టర్‌గా నిర్మిస్తున్న సత్యభామ సినిమాలో లీడ్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ..
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని చాలా రోజులుగా అనుకొంటున్నాను. కానీ మంచి కథలు నా వద్దకు రాలేదు. అందుచేత నేను హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయలేదు. కానీ శశికిరణ్ నా వద్దకు కథ తీసుకొచ్చినప్పుడు చాలా బాగా నచ్చింది. నా పాత్ర గురించి విన్నప్పుడు థ్రిల్ అయ్యాను. పెర్ఫార్మెన్స్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర అని కాజల్ అగర్వాల్ చెప్పారు.

నా జీవితంలో సెకండ్ ఫేజ్ నడుస్తున్నది. పెళ్లి తర్వాత పెద్దగా మార్పులు లేకపోయినా.. బాధ్యతలు పెరిగాయి. నా కొడుకే నాకు ప్రపంచం. అతడి తర్వాతే నాకు ఏదైనా. నీల్‌ను చూసుకోవడం నాకు మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాతే ప్రొఫెషన్‌ను చూసుకొంటాను అని కాజల్ చెప్పారు.
నీల్ కిచ్లూకు ప్రస్తుతం 18 నెలలు మాత్రమే. ఇంకా నా సినిమాలు, టీజర్లు, ట్రైలర్ల గురించి వాడికి తెలియదు. యూట్యూబ్‌లో రైమ్స్ లాంటి చూపిస్తే హ్యాపీగా ఫీలవుతాడు. కానీ నా సినిమా వీడియోలు, యూట్యూబ్ వీడియోలు చూపించడం లేదు. వాటికి అలవాటు చేస్తే బాగుండదనేది నా ఫీలింగ్ అని కాజల్ చెప్పారు.

సత్యభామ చిత్రంలో నవీన్ చంద్ర కీలకమైన పాత్ర. భార్యను నడిపించే భర్త పాత్రలో నవీన్ చంద్ర నటిస్తున్నారు. రైటర్ అమర్ పాత్రలో కనిపిస్తారు. కానీ అతడికి యాక్షన్ సీన్లు ఉండవు. కానీ నేరస్థులను పట్టించేందుకు సహాయపడుతుంటాడు. నాకు మాత్రమే యాక్షన్ సీన్లు ఉంటాయి. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి అని కాజల్ తెలిపారు.
కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న సత్యభామ సినిమాను బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలుగా నిర్మిస్తున్నారు. రమేశ్ యడ్మ, ప్రశాంత్ రెడ్డి మొటాడూ కథకు శశికిరణ్ తిక్క స్క్రిన్ ప్లే అందిస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని, సింగమ్ మోహిత్ కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











