కరోనాతో జీవితం అస్తవ్యస్తం.. కాజల్ అగర్వాల్ కంటతడి.. భావోద్వేగం
ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ అన్ని వర్గాల ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నది. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరి జీవితంపై ప్రభావం చూపిస్తున్నది. తాజాగా కరోనా కాటుకు అస్తవ్యస్తమైన ఓ జీవితాన్ని చూసి సినీ తార కాజల్ అగర్వాల్ ఆవేదనకు గురయ్యారు. చిన్న జీవితాలపై ఇలాంటి అంశాలు ఎంత దారుణంగా ఉంటాయని కంటతడి పెట్టినంత పనిచేసింది. వివరాల్లోకి వెళితే..

క్యాబ్ డ్రైవర్ పరిస్థితి చూసి
కరోనావైరస్ ప్రభావం ప్రజల జీవితాలపై ఎంత ప్రత్యక్షంగా పడిందో అనే విషయాన్ని ప్రత్యక్షంగా చూశాను. నేను నా క్యాబ్ డ్రైవర్ పరిస్థితి చూసి షాక్ తిన్నాను. గత 48 గంటల్లో ఫస్ట్ కస్టమర్ మీరే అంటూ నాకు చెప్పడంతో నాకు చాలా బాధేసింది. ఈ రోజు కారు నడిపితే వచ్చే ఆదాయం ద్వారా ఇంట్లో వస్తువులు వస్తాయేమోనని నా భార్య ఎదురు చూస్తుంటుంది అని చెప్పగానే కళ్లలో నీళ్లు తిరిగాయి అని కాజల్ వెల్లడించింది.

రోజువారి సంపాదనపై ఆధారపడితే
కరోనా వైరస్ ఎందరో జీవితాలను అతలాకుతలం చేస్తుందని విన్నాను. కానీ క్యాబ్ డ్రైవర్ పరిస్థితి చూసిన తర్వాత రోజు వారి సంపాదనపై ఆధారపడే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అనే విషయం చూసి షాక్‌కు గురయ్యాను. క్యాబ్ డ్రైవర్‌కు ఇచ్చే దానికంటే రూ.500 ఎక్కువే ఇచ్చాను. ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ చిన్నచితక జీవితాల పరిస్థితి చూసి దిగ్బ్రాంతికి గురయ్యాను అని కాజల్ ఉద్వేగానికి గురయ్యారు.

మీరే చివరి కస్టమర్ కావొచ్చు
అంతేకాకుండా దినసరి జీవితం గడవడానికి డ్రైవర్ ఎంత కష్టపడ్డారంటే.. ఫస్ట్ కస్టమర్ కోసం 70 కిలోమీటర్లు తిరిగానని చెప్పారు. క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి చూస్తుంటే బాధేస్తుంది. మీరు క్యాబ్‌లో ప్రయాణించినా.. స్ట్రీట్‌లో చిరుధాన్యాలు అమ్మే వర్తకులకు ఎక్కువగా చెల్లించండి. వారి జీవితం ఓ పూట సంతోషంగా గడుస్తుంది. మీరే ఆయన చివరి కస్టమర్ కావొచ్చు. మానవత్వంతో ప్రయత్నించండి అంటూ కాజల్ రిక్వెస్ట్ చేసింది.
Recommended Video

ఇండియన్ 2 మూవీలో
కాజల్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదం తర్వాత షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి మళ్లీ వెళ్తుంది. అలాగే మోసగాళ్లు అనే చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











