Neil Kitchlu: కొడుకు ఫొటోతో కాజల్ బిగ్ సర్‌ప్రైజ్.. నీల్ కిచ్లూ ఎలా ఉన్నాడో చూశారంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన వారిలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అదే సమయంలో ఎన్నో విజయాలను సైతం ఖాతాలో వేసుకుంది. ఫలితంగా స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకుంది.

ఇక, అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. అలాగే, కాజల్.. గౌతమ్ కిచ్లూను ప్రేమ వివాహం చేసుకుంది. అంతేకాదు, ఇటీవలే ఆమె ఓ మగబిడ్డకు తల్లైంది. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ తాజాగా తన కుమారుడి మొదటి ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం నీల్ కిచ్లూను మీరు కూడా చూసేయండి మరి!

అతడిని ప్రేమించి.. పెళ్లాడింది

అతడిని ప్రేమించి.. పెళ్లాడింది

టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్ చాలా ఏళ్ల పాటు వరుస సినిమాలతో హవాను చూపించింది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం గౌతమ్ కిచ్లూతో ప్రేమాయణం సాగించింది. ఈ క్రమంలోనే అతడిని ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఈ స్టార్ హీరోయిన్ సినిమాల వేగాన్ని పూర్తిగా తగ్గించేసింది. అలాగే, ఆఫర్లు కూడా ఆమెకు సన్నగిల్లడంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

గర్భం దాల్చడంతో కెరీర్‌ గ్యాప్

గర్భం దాల్చడంతో కెరీర్‌ గ్యాప్

వివాహం చేసుకున్న తర్వాత కూడా కాజల్ అగర్వాల్ కెరీర్‌ను కొనసాగించాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు చిత్రాల్లోనూ నటించింది. అలాగే, మరొకొన్నింటిని ఒప్పుకుంది. అయితే, ప్రెగ్నెన్సీ కారణంగా నాగార్జున 'ఘోస్ట్', తమిళ చిత్రం 'రౌడీ బేబీ' నుంచి కూడా బయటకు వచ్చేసింది. వీటితో పాటు మరిన్ని చిత్రాల నుంచి కూడా తప్పుకుని గ్యాప్ తీసుకుంది.

మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్

మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్

కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. కాజల్ అగర్వాల్ వివాహం తర్వాత ఎక్కువగా తన భర్తతో మధుర క్షణాలను అనుభవించింది. అతడితో అన్యోన్యంగా ఉంటూ కొన్ని నెలల క్రితం గర్భవతి అయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి విధితమే.

కొడుకుకు ఆ పేరు పెట్టిన జోడీ

కొడుకుకు ఆ పేరు పెట్టిన జోడీ

కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు తమ బిడ్డకు 'నీల్ కిచ్లూ' అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. నీల్ అంటే విజేత అని అర్థం వస్తుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని గౌతమ్ 'మాకు నీల్ జన్మించాడని చెప్పడానికి మేం చాలా సంతోషిస్తున్నాము. చిన్నారిని ప్రేమతో మా కుటుంబ సభ్యులు అంతా స్వాగతిస్తున్నాం' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

మదర్స్ డేన కాజల్ సర్‌ప్రైజ్

మదర్స్ డేన కాజల్ సర్‌ప్రైజ్

గర్భం దాల్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోన్న కాజల్ అగర్వాల్.. తల్లైన తర్వాత ఎక్కువగా తన బిడ్డతోనే గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా గడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సుందరాంగి మదర్స్ డే కానుకగా తన కుమారుడి మొదటి ఫొటోను షేర్ చేసింది. తద్వారా తన అభిమానులను అందరినీ సర్‌ప్రైజ్ చేసేసింది.

మొదటి అనుభవం మరువను

మొదటి అనుభవం మరువను

తన కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్ అగర్వాల్ 'నువ్వు నాకు ఎంతో విలువైనవాడివి. నేను నిన్ను నా చేతుల్లో పట్టుకుని, నీ చిన్న చేతిని నా చేతిలో పట్టుకుని, నీ వెచ్చని శ్వాసను అనుభవించిన మరియు నీ అందమైన కళ్ళను చూసిన క్షణం, నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు నా మొదటి సంతానం. నా మొదటి కొడుకు. నా మొదటి అనుభవం' అని చెప్పుకొచ్చింది.

ఆ దేవుడే నాకోసం పంపాడని

ఆ దేవుడే నాకోసం పంపాడని

కాజల్ తన కొడుకు గురించి 'రాబోయే సంవత్సరాల్లో నేను నీకు నేర్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. కానీ నువ్వు నాకు ఇప్పటికే ఎన్నో నేర్పించారు. తల్లి అంటే ఏమిటో నువ్వు నాకు నేర్పించావు. నిస్వార్థంగా ఉండాలని నేర్పించావు. స్వచ్ఛమైన ప్రేమను పంచావు. నాకు నేర్పించడానికి ఆ దేవుడే నిన్ను నాకోసం పంపించాడు' అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X