Kajal Aggarwal: బికినీలో కాజల్ ఓవర్ డోస్ షో.. అలా కూర్చోనీ అంతా చూపిస్తూ!
ముంబై నుంచి టాలీవుడ్ నుంచి దిగిన ముద్దుగుమ్మల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. తన అందం, నటనతో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ భామ.. తాజాగా 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ వయసులోనూ చెక్కుచెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. తన వయసు, ఇమేజ్‌కు తగ్గ పాత్రలు పోషిస్తూ విరామం లేకుండా నటిస్తూనే ఉన్నారు. తాజాగా మాల్దీవుల్లో తన 40వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు చందమామ. ఈ వివరాలు మీకోసం.
లక్ష్మీ కళ్యాణంతో టాలీవుడ్ ఎంట్రీ
1985 జూన్ 19న ముంబైలో స్థిరపడిన పంజాబీ కుటుంబంలో జన్మించారు కాజల్ అగర్వాల్. వీరి కుటుంబం పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి ముంబైకి వలస వచ్చింది. కాజల్‌కు చెల్లెలు నిషా అగర్వాల్ ఉంది. మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ చేసిన కాజల్ 2004లో క్యా హో గయా నా అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర పోషించి చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత దర్శకుడు తేజ .. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. కలువల్లాంటి కళ్లు, చూపు తిప్పుకోనివ్వని అందంతో తొలి సినిమాతో కుర్రాళ్లను కట్టిపడేశారు కాజల్.

మగధీరతో స్టార్ హీరోయిన్‌గా
కృష్ణవంశీ దర్వకత్వంలో తెరకెక్కిన చందమామతో తొలి బ్రేక్ అందుకున్న కాజల్ కెరీర్‌ను మగధీర మలుపు తిప్పింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో టాలీవుడ్‌లో జెండా గట్టిగా పాతింది కాజల్. అగ్రనటుల సరసన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతో పాటు తమిళంలోనూ విజయ్, సూర్య, కార్తీ వంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది. మధ్యమధ్యలో హిందీ ఇండస్ట్రీని కూడా ఓ ఊపు ఊపారు కాజల్ అగర్వాల్. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకుంది మిత్రవింద.
కన్నప్పలో పార్వతిగా
వీరిద్దరికి పదేళ్ల ముందు నుంచే పరిచయముండగా.. మూడేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఓ మంచి రోజున గౌతమ్ ఆమెకు ప్రపోజ్ చేయడంతో వెంటనే అతని ప్రేమను యాక్సెప్ట్ చేసేశారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో 2020 నవంబర్‌లో కాజల్ - గౌతమ్‌లు ఒక్కటయ్యారు. ఈ దంపతులకు కుమారుడు నీల్ సంతానం. పెళ్లి తర్వాత కూడా కాజల్ నటిస్తూనే ఉన్నారు. అయితే తన వయసు, ఇమేజ్‌కు తగ్గ పాత్రలే ఆమె పోషిస్తున్నారు. త్వరలో రిలీజ్ కానున్న కన్నప్పలో పార్వతి దేవిగా కాజల్ నటించారు. ప్రస్తుతం ది ఇండియా స్టోరీ, ఇండియన్ 3, రామాయణ పార్ట్ 1లో మండోదరిగా నటిస్తున్నారు.
మాల్దీవుల్లో కాజల్ బికినీ షో
తన ప్రతి పుట్టినరోజును కుటుంబ సభ్యులు ముఖ్యంగా చెల్లెలు నిషా అగర్వాల్‌తో జరుపుకోవడం కాజల్‌కు అలవాటు. దీనిలో భాగంగా తన భర్త గౌతమ్, కుమారుడు నీల్, చెల్లెలు నిషాతో కలిసి మాల్దీవులకు వెళ్లిన కాజల్ చిల్ అయ్యారు. ముఖ్యంగా బికినీ ధరించిన కాజల్ ఫోటోలు వైరల్ అయ్యాయి. స్విమ్ సూట్ ధరించి చెల్లెలితో బీచ్ ఒడ్డున కాజల్ కబుర్లు చెబుతున్న ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. అలాగే భర్త కుమారుడితో కలిసి బీచ్ ఒడ్డున నడుస్తూ కనిపించారు కాజల్. ఇది చూసిన నెటిజన్లు 40 ఏళ్లు వచ్చినా కాజల్ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం కాజల్ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











