Kajal Aggarwal: తల్లైన వెంటనే అలాంటి ఫొటో వదిలిన కాజల్.. డెలివరీ టైమ్‌లో ప్రమాదాన్ని వివరిస్తూ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూ హవాను చూపించిన బ్యూటీ కాజల్ అగర్వాల్. 'లక్ష్మీ కల్యాణం' అనే సినిమాతో పరిచయమైన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోయింది. ఇలా చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సందడి చేసింది.

ఈ క్రమంలోనే కాజల్.. గౌతమ్ కిచ్లూను ప్రేమ వివాహం చేసుకుంది. ఇక, తాజాగా ఆమె ఓ మగబిడ్డకు తల్లైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె గతంలో ఎన్నడూ చూడని ఓ ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు, డెలివరీ సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులను వివరించింది. ఆ సంగతులు మీకోసం!

లవ్ మ్యారేజ్... స్పీడు తగ్గింది

లవ్ మ్యారేజ్... స్పీడు తగ్గింది

చాలా ఏళ్ల పాటు టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో హవాను చూపించింది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఈ స్టార్ హీరోయిన్ సినిమాల వేగాన్ని పూర్తిగా తగ్గించేసింది. అలాగే, ఆఫర్లు కూడా ఆమెకు సన్నగిల్లాయనే చెప్పుకోవాలి. దీంతో ఆమె అభిమానులు నిరాశగా ఉండిపోయారు.

పెగ్నెంట్ అయ్యాక తప్పుకుని

పెగ్నెంట్ అయ్యాక తప్పుకుని

కాజల్ అగర్వాల్ వివాహం చేసుకున్న తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు చిత్రాల్లోనూ నటించింది. అలాగే, మరొకొన్నింటిని ఒప్పుకుంది. అయితే, ప్రెగ్నెన్సీ కారణంగా నాగార్జున 'ఘోస్ట్', తమిళ చిత్రం 'రౌడీ బేబీ' నుంచి కూడా బయటకు వచ్చేసింది. వీటితో పాటు మరిన్ని చిత్రాల నుంచి కూడా ఆమె తప్పుకుంది కూడా.

పండంటి బిడ్డకు జన్మనిచ్చి

పండంటి బిడ్డకు జన్మనిచ్చి

వివాహం తర్వాత స్పీడు తగ్గించిన కాజల్ అగర్వాల్.. ఎక్కువగా తన భర్తతో మధుర క్షణాలను అనుభవించింది. అతడితో అన్యోన్యంగా ఉంటూ కొన్ని నెలల క్రితం గర్భవతి అయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.

నీల్ కిచ్లూ అని పేరు పెట్టారు

నీల్ కిచ్లూ అని పేరు పెట్టారు

కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు తమ బిడ్డకు 'నీల్ కిచ్లూ' అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. నీల్ అంటే విజేత అని అర్థం వస్తుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని గౌతమ్ 'మాకు నీల్ జన్మించాడని చెప్పడానికి మేం చాలా సంతోషిస్తున్నాము. చిన్నారిని ప్రేమతో మా కుటుంబ సభ్యులు అంతా స్వాగతిస్తున్నాం' అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

ఆ ఫొటోతో కాజల్ స్పెషల్‌గా

ఆ ఫొటోతో కాజల్ స్పెషల్‌గా

కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే నిత్యం తనకు సంబంధించిన అప్‌డేట్లను ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ హీరోయిన్ బేబీ బంప్‌తో ఉన్న హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అంతేకాదు, తన డెలివరీ సమయంలో ఎదురైన పరిణామాల గురించి ఓ నోట్‌ను కూడా వదిలింది.

ఆ అనుభూతి మర్చిపోలేనిది

ఆ అనుభూతి మర్చిపోలేనిది

కాజల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'నా బిడ్డ నీల్‌ను ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తున్నాం. నీల్ పుట్టిన క్షణాల్లోనే తనని నా ఛాతీపై పడుకోబెట్టారు. ఆ సమయంలో నాకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఆ ఒక్క క్షణం నాకు అసలైన తల్లి ప్రేమను అర్థమయ్యేలా చేసింది. అదే సమయంలో తల్లిగా నా బాధ్యత ఎలా ఉండాలో కూడా గ్రహించచుకున్నా' అని తెలిపింది.

నిద్రలేని రాత్రులు.. సమస్య

నిద్రలేని రాత్రులు.. సమస్య

డెలివరీ సమయంలో కాజల్ ఎదుర్కొన్న సమస్యలను కూడా వివరించింది. 'వాస్తవానికి డెలివరీ అనేది అంత సులభం కాదు. మూడు నిద్రలేని రాత్రులు, తెల్లవారుజామున రక్తస్రావం, సాగిన చర్మం, ఘనీభవించిన ప్యాడ్‌లు, బ్రెస్ట్ పంపులు, అన్నిటికీ మించి టెన్షన్ ఇవన్నీ నన్ను ఆందోళనకు గురి చేశాయి. కానీ, డెలివరీ తర్వాత ఎంతో సంతృప్తి కలిగింది' అని చెప్పుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X